జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిన్నట్లు మాజీ మంత్రి జోగి రమేష్, వైసీపి నేత దేవినేని అవినాష్ ఇద్దరూ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తే బూడిదే రాలింది. సాంకేతిక కారణాల వలన నేడు వారి బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టలేమని చెపుతూనే ఇద్దరినీ వారి పాస్‌పోర్టులో పోలీసులకు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇద్దరూ తప్పనిసరిగా విచారణకు సహకరించాలని లేకుంటే, సుప్రీంకోర్టు కూడా వారికి రక్షణ కల్పించబబోదని స్పష్టం చేసింది.
మంగళగిరిలో టిడిపి కార్యాలయంపై దాడి కేసు, ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులలో వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. దేవినేని అవినాష్ అరెస్ట్ భయంతో సింగపూర్ పారిపోదామని ప్రయత్నిస్తే శంషాబాద్ విమానాశ్రయంలో పోలీస్ అధికారులు అడ్డుకొని వెనక్కు తిప్పి పంపేశారు. ఇక ఈ కేసులో పోలీసులు జోగి రమేష్‌ని ఇప్పటికే మూడుసార్లు ప్రశ్నించారు. ఈ తతంగం అంతా అరెస్ట్ చేసేందుకే అని జోగి రమేష్ గ్రహించిన్నట్లే ఉన్నారు. కనుక హైకోర్టు తిరస్కరిస్తే సుప్రీంకోర్టు వెళ్ళారు. కానీ సుప్రీంకోర్టు కూడా ఆయనకు షాక్ ఇచ్చింది.
Also Read – అవమానించిన వాడే ఆదర్శమయ్యాడా.?
ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ నందిగాం సురేష్‌ని పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు జైలుకి పంపారు. సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు తొందరపడటం లేదు కనుక తర్వాత జోగి రమేష్, దేవినేని అవినాష్ వంతే అనుకోవచ్చు. అయినా ఈ కేసులకు, జైళ్ళకి భయపడబోమని జగన్ ఎప్పుడో చెప్పారు కదా? మరి ముందస్తు బెయిల్ కోసం ఈ పరుగులు ఎందుకో?