KTR-Harish-Rao

అధికారంలో ఉన్నప్పుడు సింహంలా గర్జించిన తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌, ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రావడం లేదు. ఓ మాజీ ముఖ్యమంత్రిగా కీలకమైన బడ్జెట్‌ సమావేశాల చర్చలో పాల్గొని తప్పొప్పులను విశ్లేషిస్తూ ప్రధాన ప్రతిపక్ష నేతగా తన బాధ్యత నిర్వర్తించి ఉండాలి. కానీ బడ్జెట్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని శాసనసభలో చీల్చి చెండాడుతామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ శాసనసభకు రావడం మానుకున్నారు.

దీంతో ఆయన కుమారుడు కేటీఆర్‌, మేనల్లుడు హరీష్ రావు ఇద్దరే బిఆర్ఎస్ పార్టీ తరపున శాసనసభలో కాంగ్రెస్‌ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. కానీ కేసీఆర్‌ శాసనసభకు ఎందుకు రావడం లేదని రేవంత్‌ రెడ్డి, మంత్రులు పదేపదే అడుగుతున్నా వారు సమాధానం చెప్పలేకపోతున్నారు.

Also Read – బాలినేని ఈ సారి ‘రాజీ’ పడలేదు..!

బడ్జెట్‌ సమావేశాలకు కూడా కేసీఆర్‌ మొహం చాటేసి కొడుకుని, మేనల్లుడిని పంపిస్తునందున, బిఆర్ఎస్ పార్టీని వారిద్దరి చేతిలో పెట్టేసి ఆయన రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరూ కలిసి శాసనసభలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఢీకొంటూ కేసీఆర్‌ లేని లోటు తెలియకుండా చేస్తున్నారు కూడా!

కనుక కేటీఆర్‌కి పార్టీ అధ్యక్షుడుగా నియమించి హరీష్ రావుని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తారా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బహుశః వీటికి త్వరలో జవాబు లభించవచ్చు.

Also Read – ఐదేళ్ళ వైఫల్యం 100 రోజుల సమర్ధతని ప్రశ్నిస్తోంది!

సిఎం రేవంత్‌ రెడ్డి నిన్న శాసనసభలో బిఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌, హరీష్ రావు ఈరోజు శాసనసభలో స్పీకర్‌ పోడియం ఎదుట బైటాయించి నినాదాలు చేషారు. వారు సభకు ఆటంకం కలిగిస్తుండటంతో మార్షల్స్ వారిని బయటకు తీసుకువెళ్ళి పోలీసులకు అప్పగించారు.




వారిద్దరినీ పోలీసులు ఎత్తుకొని వ్యానులోకి తరలిస్తున్నప్పుడు, వ్యానులో కూర్చున్న తర్వాత ‘సిఎం డౌన్‌ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. దాంతో వారు సాధించేది ఏమీ ఉండదు కానీ మీడియా ద్వారా ప్రజల దృష్టిలో పడతారు. ఇటువంటి మూస రాజకీయాలు చేయడం కంటే, బిఆర్ఎస్ పార్టీలో జరిగిన తప్పులను సరిదిద్దుకొని పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించి ఉంటే ఏమైనా ప్రయోజనం ఉండేది కదా?

Also Read – శ్రీ వారి లడ్డు…ప్రసాదం కాదు ఒక ఎమోషన్..!