KCR Revanth Reddy

2023లో శాసనసభ ఎన్నికలు జరిగే వరకు తెలంగాణలో రాజకీయాలు చాలా నిలకడగా సాగేవి. కానీ బిఆర్ఎస్ ఓడిపోయి కేసీఆర్‌ గద్దె దిగినప్పటి నుంచి తెలంగాణలో ఓ విచిత్రమైన రాజకీయ వాతావరణం ఏర్పడింది.

Also Read – సనాతన ధర్మం: డీఎంకెకి అర్దమైంది… మరి మనకో?

భారీ అంచనాల మద్య విడుదలైన ఓ పెద్ద స్టార్ హీరో సినిమా మాదిరిగానే, తిరుగే లేదనుకున్న కేసీఆర్‌ని ఓడగొట్టి మూల కూర్చోబెట్టిన కారణంగా రేవంత్‌ రెడ్డిపై కూడా తెలంగాణ ప్రజలలో చాలా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ అధికారం దక్కించుకోవడానికి ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలే ఇప్పుడు ఆయన ప్రభుత్వం మెడకు గుదిబండగా మారాయి. అయితే కాస్త ఆలస్యమైనా వాటిని ఏదో విదంగా అమలు చేయవచ్చు. కానీ కేసీఆర్‌ & కో ఆయనకు ఆలోచించుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా హామీలు అమలు చేయలేకపోయారంటూ తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు.

Also Read – “వెటకారం..వెక్కిరింపులే” వైసీపీ డిక్లరేషనా.?

దీంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌ & కోని కట్టడి చేసేందుకు మేడిగడ్డ బ్యారేజి, కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి, ఫోన్ ట్యాపింగ్‌ కేసుల విచారణ చేయిస్తోంది.

అయితే కేసీఆర్‌ చాలా తెలివిగా తమ ప్రభుత్వాన్ని ఈ ఆదిపత్య పోరులోకి లాగుతూ, పాలన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించకుండా చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి, మంత్రులు ఇంకా గ్రహించిన్నట్లు లేదు. అందువల్లే అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కష్టాలు, మంచినీటి కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు.

Also Read – టాలీవుడ్: వైరస్ అప్పుడే వస్తే వాక్సిన్ ఇప్పుడు వేస్తున్నారా.?

కేసీఆర్‌ తమను ఈవిదంగా పక్కదారి పట్టిస్తూ అధికారం చేపట్టిన 5 నెలల్లోనే ప్రజల ఎదుట దోషిగా నిలబెట్టగలుగుతున్నారని కాంగ్రెస్‌ మంత్రులు గ్రహించారో లేదో కానీ అందరూ తన వెంట పరిగెట్టేలా కేసీఆర్‌ చేసుకున్నారని చెప్పవచ్చు. తద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేత కేసీఆర్‌ తప్పటడుగులు వేయించి ప్రజల ముందు దోషిగా నిలబెట్టి చూపుతున్నారు.

మూడు నెలల క్రితం శాసనసభ సమావేశాలకు వెళ్ళేందుకు కూడా భయపడిన కేసీఆర్‌, ఇప్పుడు చాలా నమ్మకంగా మరో ఆరు నెలల్లో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని, మళ్ళీ తాను ముఖ్యమంత్రి పదవి చేపడతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.




కేసీఆర్‌ని ఓడగొట్టిన రేవంత్‌ రెడ్డి చాలా పాపులర్ అయ్యారు కానీ ఇదేవిదంగా కేసీఆర్‌ వెంట పడుతూ పాలన, అభివృద్ధిని విస్మరిస్తే మళ్ళీ ఆయన చేతిలోనే అవమానం పొంది, పదవీ, అధికారం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.