disputes-in-manchu-family

మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవల గురించి మోహన్ బాబు, మనోజ్, విష్ణు ముగ్గురూ మాట్లాడారు. ఎవరికి వారు ‘మేము చాలా మంచి వాళ్ళమే ఎదుటవాడే చెడ్డవాడని’ నిందించుకుంటున్నారు. గొడవలు జరుగుతున్నప్పుడు ఇది చాలా సహజం.

మోహన్ బాబు వైసీపీతో సన్నిహితంగా ఉండేవారు. మంచు విష్ణు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ మేనకోడలిని వివాహం చేసుకున్నారు.

Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్‌ విధ్వంసానికి…

మంచు మనోజ్ టీడీపీకి చెందిన దివంగత భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్నారు. అదీ.. మనోజ్, మౌనిక ఇద్దరూ తమ జీవిత భాగస్వాములతో విడాకులు తీసుకొని రెండో పెళ్ళి చేసుకున్నారు. అప్పటికే ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. కానీ మనోజ్ ఆ బాబుని కూడా కొడుకుగా స్వీకరించారు.

రెండు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన కోడళ్ళు, వారి రాజకీయ బ్యాక్ గ్రౌండ్, మనోజ్-మౌనీకల రెండో పెళ్ళి వగైరాలు మోహన్ బాబు ఇంట్లో ఈ గొడవలకు మూల కారణంగా కనిపిస్తున్నాయి.

Also Read – ఈ విందుని జగన్‌ జీర్ణించుకోలేరేమో?

ఇద్దరూ కూడా తమ తల్లి తండ్రులు చాలా మంచివారని, వారు తమకి దేవుడితో సమానమని చెపుతున్నారు. కానీ ఎదుటవాడే తండ్రిని రెచ్చగొట్టి ఆయన భుజంపై తుపాకీ పెట్టి తమని కొట్టాలని ప్రయత్నిస్తున్నారని మనోజ్, విష్ణు పరస్పరం ఆరోపించుకున్నారు. ఇద్దరూ ఎదుటవాడే చేయకూడాని తప్పులన్నీ చేశాడని సాక్ష్యాధారాలతో సహా ఈరోజు సాయంత్రం మీడియాకు తెలియజేస్తామని ఇద్దరూ చెప్పారు.

మనోజ్ వెర్షన్ ఏమిటంటే, తండ్రి, అన్న విష్ణు ఆదేశం ప్రకారమే తాను నడుచుకునేవాడినని, అన్న సినిమాల కోసం గొడ్డులా కష్టపడినా చాలా సంతోషంగా చేశానే తప్ప ఒక్క రూపాయి ఆశించలేదన్నారు. వారు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టానని, ఇంట్లో ఉండమంటే ఉన్నానని, బయటకు పొమ్మంటే పోయానని, సినిమాలు మానేయమంటే మానేశానని అన్నారు.

Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!

వారి వలన తన జీవితం అత్యంత దయనీయంగా గడిచిందని, అయినా ఏనాడూ వారిని చేయి జాపి అర్ధించలేదన్నారు. ఇప్పుడు కూడా డబ్బు, ఆస్తుల కోసం పోరాడటం లేదని, తల్లి తండ్రులు లేని తన భార్య గురించి అనుచితంగా మాట్లాడుతుండటంతో ఆమె కోసమే పోరాడవలసి వస్తోందని మనోజ్ అన్నారు.

మంచు విష్ణు ఏమన్నారంటే, “మేమంతా ఎప్పటికీ హాయిగా కలిసి మెలిసి ఉంటామనే అనుకున్నాను. కానీ ఈవిదంగా జరుగుతుండటం చాలా బాధ కలిగిస్తోంది. ఈ పేరు ప్రతిష్టలు, ఆస్తులు అన్నీ మా నాన్నగారి కష్టార్జితమే. వాటిపై మాకెవరికీ ఎటువంటి హక్కు లేదు. అంతా ఆయన ఇష్టప్రకారమే జరగాలి. మా కుటుంబంలో చిచ్చుకి బయట వ్యక్తులే కారణం. కనుక వారు ఈరోజు సాయంత్రంలో బయటకు వెళ్ళిపోవాలి. లేకుంటే సాక్ష్యాధారాలతో సహా అన్నీ బయటపెడతాను,” అని అన్నారు.




మనోజ్, ఆయన భార్య మౌనిక పట్ల మంచు కుటుంబ పెద్ద మోహన్ బాబుతో సహా ఎవరికీ సదాభిప్రాయం లేదని స్పష్టమవుతోంది. మనోజ్ మాటలలో కూడా అదే వినిపిస్తోంది. కానీ మనోజ్, విష్ణు ఇద్దరికీ తండ్రి మోహన్ బాబు అంటే గౌరవం ఉందని చెపుతున్నారు. కనుక ఇద్దరూ ఆయన మాటకు కట్టుబడి నడుచుకోవడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారంగా కనిపిస్తోంది.