రాజకీయ పార్టీలకు ఎన్నికలలో గెలుపోటములు సహజం. కానీ ఇప్పుడు ప్రతీ పార్టీ ఎన్నికలలో గెలవక తప్పని పరిస్థితి నెలకొంది. ఓడిపోతే ఆ పార్టీ మనుగడ చాలా కష్టం అవుతుండటమే ఇందుకు కారణం.
గత పదేళ్ళలో తెలంగాణలో కాంగ్రెస్, టిడిపిలను కేసీఆర్, ఈ 5 ఏళ్ళలో ఇక్కడ ఏపీలో టిడిపిని తుడిచిపెట్టేయడానికి జగన్ ఎంతగా ప్రయత్నించారో అందరూ చూశారు.
Also Read – అమ్మ అందరికీ అమ్మే కానీ ఎవరి తల్లి వారిదే!
కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ టిడిపి ఎంతో ఓపికగా వారి వేధింపులను భరిస్తూ, పార్టీ చెల్లాచెదురు కాకుండా కాపాడుకుంటూ, ఎంతో ధైర్యంగా వారిని ఎదుర్కొని పోరాడాయి. నేడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. రేపు ఏపీలో టిడిపి కూటమి కూడా అధికారంలోకి రాబోతోంది.
అయితే అధికార పార్టీలు రాజకీయాలలో ఇటువంటి దుసంస్కృతిని ప్రవేశపెట్టినందున, బాధిత పార్టీలు కూడా ఆ సంస్కృతిని ఫాలో అవక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Also Read – జగన్‌ని అడ్డుకోవాలంటే విభీషణులు అవసరమే
ఇందుకు తాజా నిదర్శనంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీని తుడిచిపెట్టేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. రేపు ఏపీలో టిడిపి అధికారంలోకి వస్తే అది కూడా వైసీపిని నిర్వీర్యం చేయకమానదు.
రాజకీయాలలో ఇటువంటి అప్రజాస్వామిక, అవాంఛనీయ ధోరణి నానాటికీ ఎందుకు పెరిగిపోతోంది? అని ప్రశ్నించుకుంటే అధికార లాలసే అని చెప్పక తప్పదు.
Also Read – అక్రమాస్తుల కేసులు: మరక మంచిదే?
పదవి, అధికారం కోసం ఓ రాజకీయ పార్టీ ఓ మెట్టు దిగితే, మిగిలిన పార్టీలు మరో రెండు మెట్లు దిగక తప్పడం లేదు. అయితే పదవి, అధికారం లేకపోయినా ఇదివరకు అందరూ రాజకీయాలలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఎన్నికలలో ఓడిపోతే ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేని పరిస్థితి నెలకొనడం రాజకీయాలలో అవాంఛనీయ పరిస్థితే అని చెప్పుకోవచ్చు.
ఇది రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితం అయ్యుంటే, ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఈ అనైతికత ప్రభుత్వం, దానిలో అధికారులు, ఉద్యోగులు, చివరికి సామాన్య ప్రజలపై కూడా చాలా దుష్ప్రభావం చూపుతుండటం వలన ప్రతీ ఒక్కరూ బాధితులుగా మారాల్సి వస్తోంది.
తిరుపతి, చిత్తూరు, అనంతపురం, పల్నాడు తదితర ప్రాంతాలలో ఇటీవల జరిగిన ఘర్షణలలో గాయపడుతున్నవారు లేదా చనిపోతున్నవారు వివిద పార్టీల కార్యకర్తలే కావచ్చు. కానీ వారు కూడా సామాన్య ప్రజానీకమే కదా?వారికీ కుటుంబాలు, జీవితాలు ఉంటాయి కదా?
రాజకీయ పార్టీల కోసం ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం బాధాకరమే కదా? మరి రాజకీయాలలో ఈ విష సంస్కృతికి ముగింపు ఎలా… ఎప్పుడు?ఎవరైనా చెప్పగలరా?