
భారత్ ఎన్నడూ పొరుగు దేశాలతో యుద్ధాలు చేయాలని కోరుకోదు. పైగా చైనా, పాకిస్థాన్‌లు మన భూభాగాలను ఆక్రమిస్తున్న ఉదాసీనంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి.
ఇందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్ అతిపెద్ద నిదర్శనం. అప్పుడే దానిని భారత్ స్వాధీనం చేసుకునే అవకాశమున్నా నాడు మన పాలకులు ‘శాంతి మంత్రం’ జపిస్తూ ఐక్యరాజ్య సమితిలో ఈ పంచాయితీ పెట్టారు. అప్పటి నుంచి అది పాక్ అధీనంలోనే ఉండిపోయింది.
Also Read – వైసీపీ రాజకీయాలు మారాయి… మరి టీడీపీ?
దానిని మనం పోగొట్టుకున్నా మిగిలిన కశ్మీర్‌లోనైనా ప్రశాంత వాతావరణం ఉందా అంటే అదీ లేదు. కనుక భారత్‌కు కిరీటంలా ధగధగా మెరవాల్సిన కశ్మీర్ కరోనా వ్యాధిలా మారి భారత్‌ని పీడిస్తూనే ఉంది.
చివరికి ఆపరేషన్ సింధూర్‌తో ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం లభిస్తుందనుకుంటే, డోనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తానంటూ వచ్చి కాల్పుల విరమణతో భారత్‌కు బ్రేకులు వేశారు. పాక్ వినదని తెలుసు కనుకనే భారత్ అయిష్టంగానైనా కాల్పుల విరమణకు అంగీకరించిందని భావించవచ్చు. అదే జరిగింది కూడా.
Also Read – జైల్లో సౌకర్యాలు లేవు… ఇలా అయితే ఎలా?
రెండు మూడు గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ కాల్పుల విరమణ హామీని ఉల్లంఘించి భారత్‌పై మళ్ళీ దాడులు ప్రారంభించింది.
అందుకు కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 1. సైన్యం ఒత్తిడి, 2. చైనా మద్దతు, 3. పాక్ రాజకీయాలు.
Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?
ఇప్పటికే పలుమార్లు భారత్ చేతిలో ఓడిపోయి అవమానాలు భరిస్తున్న పాక్ సైన్యానికి ‘ఆపరేషన్ సింధూర్’ తదనంతర దాడులు తీరని అవమానం, అప్రదిష్టగా మారాయి. కనుక పాక్ నాశనమైపోయినా పర్వాలేదు అణు బాంబులు ప్రయోగించి ప్రపంచ పటంలో నుంచి భారత్‌ని తుడిచిపెట్టేయాలని ఆరాటపడుతున్నారు.
సార్వభౌమాధికారం కాపాడుకోవడం కోసం పోరాడుతున్న పాకిస్థాన్‌కి అండగా ఉంటామని చైనా హామీ ఇచ్చింది. అంటే భారత్‌తో మీరు యుద్ధం చేయండి.. డబ్బు, ఆయుధాలు మేము సమకూరుస్తాము. అవసరమైతే మేమే రంగంలో దిగి భారత్‌ని దెబ్బ తీస్తామని చైనా హామీ ఇచ్చినట్లే భావించవచ్చు.
పాక్ ప్రజల దృష్టిని తమ అసమర్ధ, అవినీతి పాలనపై మళ్ళించి, అధికార పార్టీ దేశ రాజకీయాలలో పైచేయి సాధించాలంటే భారత్‌తో యుద్ధం అవసరమే. అందుకే ట్రంప్ చెప్పినా పాక్ వినడం లేదు!
భారత్‌కి కూడా ఈ యుద్ధం చాలా అవసరమే. పాక్‌ని గట్టిగా దెబ్బ తీయగలిగితే పాక్ ఉగ్రవాదులు మళ్ళీ ఎన్నడూ దేశంలో అడుగు పెట్టడానికి కూడా సాహసించకుండా చేయవచ్చు. కరోనా వైరస్‌ల మారిన కశ్మీర్ సమస్యకి శాశ్విత పరిష్కారం కోసం ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ని స్వాధీనం చేసుకోవడం’ చాలా అవసరం. కనుక ఈ లక్ష్యం కోసమే యుద్ధం ప్రారంభించి ఉంటే అది పూర్తిచేయకుండా మద్యలో ఆగిపోతే ఇదంతా వృధా ప్రయాసగా మిగులుతుంది.
ముఖ్యంగా భారత్ శక్తి సామర్ధ్యాలు, సాంకేతిక ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆపరేషన్ సింధూర్‌తో ఇప్పటికే కొంత చాటి చెప్పింది కూడా.
నాలుగు రోజుల క్రితం దేశంలో అన్నీ పార్టీలు మోడీ ప్రభుత్వానికి సంఘీభావం తెలిపి పాక్‌పై దాడి చేసి తీరాల్సిందే అని గట్టిగా చెప్పాయి. కానీ నేడు అవే పార్టీలు మోడీ ప్రభుత్వం భయపడి తోక ముడిచిందని అప్పుడే ఎద్దేవా చేస్తున్నాయి. మోడీ కంటే ఇందిరా గాంధీ చాలా ధైర్యంగా యుద్ధం చేసి పాక్‌కి గట్టిగా బుద్ది చెప్పారంటూ అప్పుడే కాంగ్రెస్ పార్టీ, దాని మిత్ర పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
కనుక అటు పాక్, ఇటు భారత్ ప్రభుత్వానికి కూడా ఈ యుద్ధం తప్పనిసరిగా మారిందని చెప్పవచ్చు. కానీ భారత్ తన లక్ష్యాలను వీలైనంత త్వరగా సాధించి త్వరగా యుద్ధం ముగిస్తేనే మేలు. లేకుంటే అనర్ధాలు తప్పవు.