Kommini Srinivas Rao

వైసీపీలో ఉన్నత పదవులు పొందాలన్నా, సాక్షి మీడియా నుంచి వైసీపీ పార్టీలోకి ప్రమోషన్ దక్కాలన్నా వైసీపీ రాజ్యాంగం ప్రకారం అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలను వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యాలి, లేకుంటే రాష్ట్ర రాజధాని అమరావతి పై విష ప్రచారం చేయగలగాలి.

వైసీపీ చరిత్ర ను ఒక్కసారి తిరగేసి చూస్తే ఈ అంశం పై పూర్తి స్పష్టత వస్తుంది. గతంలో చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్లినందుకు గాను జోగి రమేష్ కు, బాబు కుటుంబం పై రెచ్చిపోయినందుకు గాను కొడాలి, రోజా లకు మంత్రి పదవులు దక్కితే,

Also Read – మామిడి రైతుల సమస్యలకు బదులు జగన్‌ హంగామా హైలైట్!

ఇక పవన్ పై వ్యక్తిగత విమర్శలతో తెగబడినందుకు గాను పేర్ని నాని, అంబటి రాంబాబు మంత్రి పదవులను అంది పుచ్చుకున్నారు. అలాగే ఇటు ఇండస్ట్రీ నుంచి పోసాని దిగజారుడుతనానికి గాను వైసీపీ ప్రభుత్వంలో ఆయనకు ఒక పదవి దక్కింది.

అలాగే వైసీపీ అధికారంలోకి రాకముందు వరకు సాక్షి మీడియాలో ప్రధాన పాత్ర పోషించిన సజ్జల గారికి మూడు రాజధానుల తో అమరావతి విధ్వంసానికి సలహా ఇచ్చినందుకు గాను ఏకకంగా క్యాబినెట్ ర్యాంక్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా వైసీపీ లోకి ప్రమోషన్ లభించింది.

Also Read – వైసీపీ PHD లు ఎన్నో ఎన్నెన్నో.?

ఇక రాష్ట్ర రాజధానిని స్మశానం తో పోల్చినందుకుగాను బొత్స కు జగన్ ఆశీస్సులు లభిస్తే, బాబు సతీమణి భువనేశ్వరి పై వ్యక్తిగత దాడి చేసినందుకుగాను వంశీ అందగాడు గా ప్రమోషన్ అందుకున్నాడు. అయితే ఇవన్నీ కూడా వైసీపీ అరాచకతత్వానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి.

గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో మంత్రిపదవులు దక్కించుకున్న వారిలో సింహ భాగం, వైస్ జగన్ ను ఇంప్రెస్ చేసిన వారిలో అత్యధిక భాగం ఇలా పదవులు సంపాదించినవారే కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే వైసీపీ రాజ్యాంగం ప్రకారం ఉన్మాదులకు, విధ్వంశకారులకు, రాష్ట్ర వినాశనాన్ని కాంక్షించే, మహిళలను అగౌరవపరిచే వారికి జగన్ ప్రోత్సహకాలు తప్పక లభిస్తాయి అనే సంకేతాలు వైసీపీ శ్రేణులకు బలంగా వెళ్ళాలి.

Also Read – జగన్‌-చంద్రబాబు పర్యటనలలో ఎంత తేడా!

ఈ సంకేతాలను పరిశీలిస్తే తాజాగా సాక్షిలో రాజధాని అమరావతి పై రెచ్చిపోయిన కృష్ణంరాజు, కొమ్మినేనికి కూడా త్వరలో వైసీపీ తరుపున పదవి ప్రమోషన్ దక్కనుందా అన్న చర్చ నడుస్తుంది. రాజధానిని మూడు ముక్కలు చెయ్యాలి అనే ఆలోచన సజ్జలను ప్రభుత్వ సలహాదారుగా నిలబెట్టింది, వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా సజ్జలకు, ఆయన తనయుడికి స్థానం దక్కేలా చేసింది.

ఇక ఇప్పుడు ఏకంగా రాజధానిని అత్యంత హీనంగా కించపరుస్తూ, అక్కడి మహిళల మనోభవాలను అత్యంత దారుణంగా దెబ్బతీస్తూ రెచ్చిపోయిన కృష్ణంరాజు, వాటిని కనీసం ఖండించలేని కొమ్మినేని లకు జగన్ అభయం తప్పక లభిస్తుంది అనేలా కనిపిస్తుంది.

అందుకు తగ్గట్టే నేడు మీడియా ముందుకొచ్చిన జగన్ తన సొంత మీడియాలో జరిగిన ఈ దారుణ సంఘటనను ఖండించక పోగ, సాక్షి మీడియాలో రాజధాని ప్రాంత మహిళలకు జరిగిన అవమానానికి చింతించకపోగా అటువంటి వారిని అరెస్టు చేసినందుకు కూటమి ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు.




70 ఏళ్ళ పెద్దాయన అంటూ కొమ్మినేని అరాచకానికి పెద్దరికం ముసుగు తొడుగుతున్న జగన్, భవిష్యత్ లో వైసీపీ అధికారంలోకి వస్తే ఆ పెద్దాయనకు పెద్ద పదవే ఆఫర్ చేసేలా కనిపిస్తున్నారు. చూడాలి మరి కొమ్మినేని కూడా మరో సజ్జల గా వైసీపీ లో చక్రం తిప్పనున్నారా.? లేక కృష్ణంరాజు మరో సలహాదారుగా వైసీపీ ప్రభుత్వాన్ని నడపనున్నారా అనేది.