‘గుడ్డి’ ప్రభుత్వానికి…’గుడ్డు’ మంత్రికి…’గూగుల్’ విలువ తెలుసా.?
ఐదేళ్లు చేతిలో అధికారం పెట్టుకుని ప్రభుత్వం పేరుతో రాష్ట్రంలో రాజధానుల ఆట మొదలుపెట్టిన వైసీపీ తన హయాంలో రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలు ‘గుడ్డి సున్నా’ అనే చెప్పాలి. అలాగే ఇటు అమరావతి, అటు విశాఖ, ఇక కర్నూల్…ఇలా మూడు ప్రాంతాలలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జగన్ హయాంలో జరగలేదు అంటే అతి శయోక్తి కాదు.
Also Read – ఈ విందుని జగన్ జీర్ణించుకోలేరేమో?
పరిశ్రమలు రాక, ఉన్న పరిశ్రమలను కూడా పొరుగు రాష్ట్రాలకు తరిమేస్తూ, ఏపీలో ఉపాధి అనేది అందని ద్రాక్షగా మార్చిన వైసీపీ తన ప్రభుత్వ విధానాల వలన రాష్ట్రం మరో పదేళ్లు తిరోగమన దిశగా దిగజారుతోంది అనేది కూడా గ్రహించలేని ‘గుడ్డి’ ప్రభుత్వంగా మిగిలిపోయింది.
ఈ గుడ్డి ప్రభుత్వానికి తోడు వైసీపీ ఏపీకి ఒక ‘గుడ్డు’ ఐటీ మంత్రిని అందించింది. గతంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో చూడని విధంగా మాజీ ఐటీ గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాధ్ రాష్ట్రానికి పరిశ్రమల క్రింద నూడిల్స్, చాట్ మసాలా బండ్లను, కోడి గుడ్డు తీరిని ప్రవేశ పెట్టారు.
Also Read – కోటి సభ్యత్వాలు: ఎన్టీఆర్‌కి ఇదే కదా నివాళి?
దీనితో ఏపీకి పరిశ్రమలు అంటే ప్రభుత్వ బటన్ షాపులు, చికెన్ దుకాణాలు, కోడిగుడ్డు ఫారంలు అనేలా పరిస్థితులు మారిపోయాయి. అయితే నాటి గుడ్డి ప్రభుత్వ విధానాలతో, గుడ్డు మంత్రి గారి ఆలోచనలతో విసిగిపోయిన ఏపీ ప్రజలు ఓట్ అనే బటన్ ను గట్టిగా గుద్ది ఏపీ తలరాతను మార్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే జగన్ మొదలు పెట్టిన రాజధానుల ఆటకు చెక్ పెట్టి ఏపీ రాజధాని అమరావతే అంటూ దాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చారు. ఇక రాజధానిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాస స్థలాన్ని కొనుగోలు చేయడంతో బాబు మీద వైసీపీ చేస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టారు.
Also Read – సంక్రాంతి గేమ్ చేంజర్ వెంకటేషే… మళ్ళీ విక్టరీ!
అలాగే కూటమి ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఏపీకి పరిశ్రమలను ఆహ్వానించే ప్రయత్నంలో భాగంగా నాడు చేసిన అమెరికా పర్యటనకు నేడు ఫలితాలు కనిపిస్తున్నాయి. వాటి ఫలాలు అందుకోవడానికి ఏపీ లోని విశాఖ భాగం కానుంది.
నేడు జరిగిన కలెక్టర్ల సమావేశంలో భాగంగా సీఎం బాబు మాట్లాడుతూ ‘గూగుల్’ విశాఖలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించిందని, దాని కై ఇప్పుడే గూగుల్ సంస్థ ప్రతినిధులతో ఎంఓయూ ల మీద ఒప్పందాలు చేసుకుని సంతకాలు చేయడం జరిగిందని, ఇదంతా కూడా లోకేష్ కృషి వల్లే సాధ్యమయ్యిందని ప్రకటించారు.
అలాగే పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఉండదని, ప్రస్తుత కాలంలో హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్ వర్క్ ఫలితాలనిస్తుందని, అందరు దాన్ని ఫాలో అయితే రాష్ట్రానికి మంచి ఫలితాలు వస్తాయంటూ పేర్కొన్నారు. గూగుల్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యాపార దిగ్గజ సంస్థ.
అటువంటి సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది అంటే అందునా విశాఖ సముద్ర తీరాన ఈ సంస్థ ఏర్పాటు చేయడానికి ముందుకొస్తుంది అంటే అది విశాఖ గౌరవాన్ని మరింత పెంచినట్టే అవుతుంది. అలాగే బాబు చెప్పినట్టు ఏపీ అభివృద్ధికి గూగుల్ ఒక గేమ్ ఛేంజర్ కావడంలో ఎటువంటి సందేహం అవసరం లేదనే చెప్పాలి.
అయితే గత పాలకులకు అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం, ప్రభుత్వ భూమలను తాకట్లు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం తెలుసు కానీ గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల విలువ కానీ, వాటి వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం కానీ, ఇక్కడి ప్రజలకు దొరికే ఉపాధి అవకాశాల గురించి కానీ తెలుసా.? అనేది సందేహమే సుమీ..!