
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేడు సౌదీ అరేబియాలో పరటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “యుద్ధరంగంలో దిగిన భారత్-పాక్‌లకు తాను కొన్ని వాణిజ్య ప్రతిపాదనలు చేశానని చెప్పారు. యుద్ధం కంటే వ్యాపారాలు చేసుకొని అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ అన్నారు.
Also Read – చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి
తన మాట మన్నించి భారత్-పాక్ కాల్పుల విరమణ చేసినందుకు ఇరుదేశాలను అభినందిస్తూనే, డోనాల్డ్ ట్రంప్ మరో సలహా ఇచ్చారు.
ఇరు దేశాల మద్య రాజీ కుదిర్చేందుకు గట్టిగా ప్రయత్నించిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబియోల సమక్షంలో భారత్-పాక్ ప్రతినిధులు ఓ చక్కటి విందు దౌత్యం చేసుకుంటే బాగుంటుందని డోనాల్డ్ ట్రంప్ సూచించారు.
Also Read – పేర్ని నాని ప్రశ్నకు సమాధానం ఉందా?
భారత్-పాక్ యుద్ధం నిలిపివేయించినందుకు డోనాల్డ్ ట్రంప్‌ని తప్పక అభినందించాల్సిందే. కానీ ఆయనకు (అమెరికాకు) పాక్ పట్ల ఉన్న సానుభూతి భారత్ పట్ల లేకపోవడమే బాధాకరం. గత నాలుగు దశాబ్ధాలుగా పాక్ ప్రేరిత ఉగ్రవాదులు భారత్‌పై దాడులు చేస్తూనే ఉన్నారు. ఆ దాడులలో వందలాది అమాయక ప్రజలు, సైనికులు చనిపోతూనే ఉన్నారు. పాక్ ఉగ్రవాదులు భారత్ పార్లమెంటుపై కూడా దాడికి ప్రయత్నించిన సంగతి డోనాల్డ్ ట్రంప్‌కి తెలియదనుకోలేము.
ఒకవేళ ఇదేవిదంగా పాక్ లేదా మరో ఉగ్రవాద దేశమో అమెరికాపై ఇదే విదంగా దాడులు చేస్తుంటే ట్రంప్ సహించేవారా?
Also Read – ఇప్పుడు ఇద్దరికీ జైల్లో లైవ్ షో?
ట్రంప్ అధ్యక్షుడు కాగానే ప్రపంచ దేశాలు ఆమెరికాని దోచేసుకుంటున్నాయంటూ భారీగా సుంకాలు విధించారుగా?
ఇరాన్‌లో అణ్వాయుధాలున్నాయనే సాకుతో ఆ దేశంపై దాడి చేసి సద్దాం హుస్సేన్ వేటాడి చంపిన సంగతి ట్రంప్‌కి తెలియదా?
ట్విన్ టవర్స్‌పై దాడి చేసి వేలాదిమంది చావులకు కారణమయ్యారని బిన్ లాడెన్‌ని వేటాడి మట్టుపెట్టిన విషయం ట్రంప్‌కి గుర్తు లేదా?
తమ దేశం జోలికి వస్తే ఇంతగా స్పందించే అమెరికా అధ్యక్షులు, నాలుగు దశాబ్ధాలుగా భారత్‌పై పాక్ ఉగ్రదాడులు చేయిస్తుంటే, దానికే మద్దతు ఇస్తున్నారు తప్ప బాధిత దేశమైన భారత్‌కు మద్దతు ఇవ్వడం లేదు!
మే 7న భారత్-పాక్ మద్య యుద్ధం మొదలవగా, మే 9న అంతర్జాతీయ ద్రవ్య నిధి అత్యవసరంగా సమావేశమై పాకిస్థాన్‌కు రూ.8,300 కోట్లు ఇచ్చింది దేనికి? ఆ సొమ్ముని పాక్ దేని కోసం వినియోగిస్తుందో భారత్ పదేపదే చెపుతున్నప్పటికీ, అమెరికా, యూరోపియన్ దేశాలు పాక్‌కు అంత హడావుడిగా అంత భారీగా నిధులు ఎందుకు అందించాయి?అంటే పాక్ పట్ల సానుభూతి వల్లనే అని అర్దమవుతోంది.
ఓ పక్క భారత్‌పై దాడులు చేస్తున్న పాక్‌కు నిధులు, ఆయుధాలు అందిస్తూ, ఇరు దేశాలు యుద్ధం మానుకొని శాంతి చర్చలు మొదలుపెట్టాలని డోనాల్డ్ ట్రంప్ సూచించడం చాలా విడ్డూరంగా ఉంది కదా? ఒకవేళ పాక్‌ని నిజంగానే కట్టడి చేయాలని ట్రంప్ అనుకొని ఉంటే, ఆ నిధులు మంజూరు చేయకుండా అడ్డుకుంటే సరిపోయేది కదా? అయినా భారత్ నొప్పి అమెరికాకు, డోనాల్డ్ ట్రంప్‌కు ఏమర్దమవుతుంది?