
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతోందని వైసీపీ నేతలు రోజూ పాట పాడుతూనే ఉంటారు. మరోపక్క మేము కూడా బ్లూబుక్ వ్రాసుకుంటున్నామని, నేను మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే మా బ్లూడైరీలో వాళ్ళందరి తాట తీస్తామని వారి అధినేత జగన్ చెపుతుంటారు. పార్టీలో కార్యకర్తలు కూడా డైరీలు మెయింటెయిన్ చేయాలని హితవు పలికారు.
తాజాగా తెలంగాణలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా గులాబీ డైరీ మొదలుపెట్టామని చెప్పారు. అధికారంలోకి రాగానే దానిలో పేర్లున్న వారందరి తాట తీస్తామని హెచ్చరించారు. అంటే రెడ్ బుక్ తప్పు కాదని వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలు ఒప్పుకుంటున్నారన్న మాట!
Also Read – మంచి ప్రశ్న వేశారు మద్యలో ఆవు కధ దేనికి భూమనగారు?
రెడ్ బుక్ రాజ్యాంగం తప్పు, అప్రజాస్వామికమని విమర్శిస్తున్నప్పుడు, మనం కూడా అటువంటి పనిచేయకూడదని పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెప్పాలి కదా?కానీ మనమూ మొదలుపెడదామని ఎందుకు చెపుతున్నారు?
అసలు నారా లోకేష్ రెడ్ బుక్ ఎందుకు మొదలుపెట్టాల్సి వచ్చింది అని ఆలోచించాల్సిన వైసీపీ అధినేత జగన్, కానీ మనమూ డైరీలు మెయింటెయిన్ చేద్దామని చెపుతుండటాన్ని ఏమనుకోవాలి?
Also Read – అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం.. భేష్!
అధికారంలో ఉన్నప్పుడు పాలకులు పాలన, రాష్ట్రాభివృధ్దిపై దృష్టి పెట్టి పనిచేసుకోవాలి. అందుకే ప్రజలు మనకి అధికారం కట్టబెట్టారని గ్రహించాలి.
కానీ ప్రతిపక్షాలను తుడిచిపెట్టేసి తమకు, తమ అధికారానికి, తమ పార్టీకి ఎదురేలేకుండా చేసుకొని 25-30 ఏళ్ళు మనమే అధికారంలో ఉండాలనే దురాశ, దుర్బుద్ధి, అప్రజాస్వామిక ధోరణితో ప్రతిపక్షాలను వేధించడం వల్లనే రెడ్ బుక్ పుట్టుకొచ్చింది. తలుపులు మూసి కొడుతుంటే పిల్లి అయినా పులిలా తిరగబడుతుంది. నారా లోకేష్ కూడా అదే చేశారు.
Also Read – కన్నప్ప తీయడం కూడా శివలీలే!
కానీ అధికారంలోకి వచ్చాక ఆ రెడ్ బుక్ ప్రకారమే ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించలేదు. అందుకు సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా వ్యతిరేకమే.
కానీ పదవీ, అధికారం కోల్పోయినంత మాత్రాన్న ఎవరు చేసిన నేరాలు, ఘోరాలు ఆటోమేటిక్‌గా మాఫీ అయిపోవు. కనుక చట్ట ప్రకారమే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటున్నారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, ఆ కేసులో సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడమే ఇందుకు తాజా నిదర్శనం.
టీడీపీ నేతలు చెప్పిన్నట్లు రెడ్ బుక్ ప్రకారం చేసి ఉంటే జగన్‌తో సహా ఒక్క వైసీపీ నేత బయట ఉండేవాడే కాదు కదా?