ఓ రాజకీయ పార్టీని స్థాపించి నిర్వహించడం, అధికారంలోకి రావడం ఎంతో శ్రమ, ఖర్చు, ఒత్తిళ్ళతో కూడుకున్నవి. ముఖ్యంగా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడం ఓ మహాయజ్ఞం వంటిదే. ఆ యజ్ఞం ఫలించి అధికారంలోకి రాగలిగితే పాలకులుగా మారే రాజకీయ నాయకులు దాని విలువని సదా గుర్తుంచుకుని, ప్రజలు తమకి ఎందుకు అధికారం అప్పగించారో గుర్తెరిగి మెలగాలి.
కానీ చాలా రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు ఈ దశలోనే విఫలం అవుతుంటారు. తమ గొప్పదనం చూసే ప్రజలు తమని ఎన్నుకున్నారని భావిస్తూ ఆ అహంభావం, అధికార మదంతో తప్పులు చేయడం మొదలుపెట్టి అధికారం కోల్పోతుంటారు.
Also Read – జగన్ దెబ్బకి రేషన్ బియ్యం నిలిచిపోయేలా ఉందే!
అవినీతి, అక్రమాలు, రాజకీయ సమీకరణాలు, ఎన్నికల వ్యూహాలు, ప్రలోభాలు వగైరాలన్నీ కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తాయి.
కానీ ఇవే కాకుండా అహంభావం, నిరంకుశ, అప్రజాస్వామిక ధోరణులు కూడా ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ఓటమికి కారణమయ్యాయని అందరికీ తెలుసు.
Also Read – రెండూ సంక్రాంతి రిలీజ్ బొమ్మలే!
కానీ ఇప్పుడు ఈ చర్చ వారి గురించి కాదు. అధికారం కోల్పోయిన కేసీఆర్ అధికారంలో ఉన్నవారు ఏవిదంగా మెసులుకోవాలో చెప్పిన మంచి విషయాల గురించి. ఆయన చెప్పిన ఈ మంచి విషయాలను ఆయనే పాటించక పోయి ఉండొచ్చు. కానీ అధికారంలో ఉన్నప్పుడు పాలకులు ఎలా మెసులుకోవాలో ఆయనకి బాగా తెలుసని స్పష్టమవుతోంది.
“మనకు ప్రజలు బాధ్యతగా పనిచేయమని అధికారం ఇస్తారు. తమకి మంచి చేయాలని ప్రజలు కోరుకుంటారు. కానీ హైడ్రాతో తమ ఇళ్ళు కూల్చేయాలని కాదు. రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది.
Also Read – ఈసారి కూడా హాట్ ఫేవరేట్స్ అవేనా.?
అధికారంలోకి వచ్చాక మొదటి 6 నెలలు పూల బొకేలు, అభినందనలతో, చివరి 6 నెలలు ఎన్నికల హడావుడితో గడిచిపోతుంది. మిగిలిన నాలుగేళ్ళలోనే ఏమైనా చేస్తే చేయాల్సి ఉంటుంది.
కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11 నెలలైనా హామీలను, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా హైడ్రాతో ప్రజలను, కేసులతో మనల్ని భయపెట్టి, బెదిరిస్తూ పాలన సాగిస్తోంది.
కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఎన్నుకున్నందుకు ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. బిఆర్ఎస్ పార్టీని వద్దనుకొని తాము ఏం కోల్పోయామో ప్రజలు అర్దం చేసుకుంటున్నారు.
కనుక మళ్ళీ మనమే తప్పకుండా అధికారంలోకి వస్తాము. ప్రజలే మనకి అధికారం ఇస్తారు. అంతవరకు మనం ఓపిక పట్టాలి,” అని కేసీఆర్ అన్నారు.
కేసీఆర్ చెప్పిన ఈ మంచి మాటలు స్వయంగా ఆయనకు, బిఆర్ఎస్ పార్టీ నేతలతో సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అన్ని పార్టీలకు, నాయకులకు కూడా వర్తిస్తాయని చెప్పవచ్చు.
కానీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, జగన్ కూడా ఇందుకు పూర్తి భిన్నంగానే వ్యవహరించారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని కేసీఆర్, జగన్ వాదిస్తున్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తుంటే రాజకీయ పార్టీలను గద్దె దించేయడానికి ప్రజలు వెనకాడరని కేసీఆర్ అనుభవపూర్వకంగా చెప్పిన మాట నూటికి నూరుశాతం నిజమే కదా?
కేసీఆర్, జగన్ రాజకీయ కోణంలో చేసే విమర్శలు, వాదనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నవారు ఎవరికివారు ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ పాలన సాగించడం చాలా అవసరం. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ అలాగే చేస్తున్నారు. అలాగే సాగాలని కోరుకుందాము.