
గత కొన్నేళ్లుగా కళా రంగానికి ప్రోత్సహకంగా ప్రభుత్వాలు అందించే నంది అవార్డులను రెండు తెలుగు ప్రభుత్వాలు విస్మరించాయనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ప్రభుత్వం సాంస్కృతిక కళాకారులను, వారు కళా రంగానికి చేసిన సేవలను గుర్తించి వారిని నంది అవార్డులతో సత్కరించేవారు.
అటు సినీ రంగానికి సంబంధించిన సెలబ్రెటీలు సైతం ఈ నంది అవార్డులను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేవారు. ఉత్తమ చిత్రం మొదలుకుని, ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు, గేయరచయిత, గాయని గాయకులు…ఇలా అనేక అంశాల ప్రాతిపదికగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగేది.
Also Read – సొంత చెల్లినే పీడించిన జగన్ ప్రత్యర్ధులను ఉపేక్షిస్తారా?
అయితే రాష్ట్ర విభజనతో అటు తెలంగాణలో నంది అవార్డుల కార్యక్రమాన్ని అటకెక్కించారు అప్పటి ప్రభుత్వ పెద్దలు కేసీఆర్. ఇక ఏపీ విషయానికొస్తే అప్పటి టీడీపీ 2016,17 కు గాను సినీ పరిశ్రమకు నంది అవార్డులను అందించింది. అయితే ఆ కార్యక్రమంలో ఏర్పడిన కొన్ని వివాదాలతో ఏపీలో కూడా నంది అవార్డుల అంశం తెరమరుగున పడిపోయింది.
ఇక 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ టికెట్ల రేట్ల తగ్గింపు తో సినీ పరిశ్రమ పై మొదలుపెట్టిన ఆధిపత్య యుద్ధం ఐదేళ్ల పాటు నిర్వీరంగా కొనసాగిస్తూ వచ్చింది. అలాగే ఇండస్ట్రీ పెద్దలను సైతం తాడేపల్లి ప్యాలస్ కు రప్పించుకుని వారితో చేతులు జోడించేలా చేసుకుని తమ అహాన్ని చల్లర్చుకున్నారు నాటి ముఖ్యమంత్రి వైస్ జగన్.
Also Read – బనకచర్ల పేరుతో కాంగ్రెస్, బిఆర్ఎస్ యుద్ధాలు.. ఏపీకి తలనొప్పులు!
ఇక ఇప్పుడు రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారడంతో ఇప్పటి ముఖ్యమంత్రులు కళాకారులను సన్మానించేందుకు ముందుకొచ్చారు. ఇందుకు గాను అటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించగా, తాజాగా ఆంధ్రపద్రేశ్ కూటమి ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది. దీనితో సినీ పరిశ్రమకు ‘డబల్ ధమాకా’ రెండు రాష్ట్ర ప్రభుత్వాల సత్కారాలు దక్కనున్నాయి.
అయితే ఇటు ఏపీలో రాష్ట్ర డిప్యూటీ సీఎం గా, హిందూపూర్ ఎమ్మెల్యే గా ఇద్దరు సినీ దిగ్గజాలు ప్రభుత్వంలో భాగమయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీలో సినీ పరిశ్రమకు పెద్ద పీట వేసే అవకాశం లేకపోలేదు.
Also Read – రప్పా రప్పా నరుకుతాం.. అవునా.. తప్పేమిటి?
అయితే ఇండస్ట్రీ పెద్దలు కూడా అటు తెలంగాణతో పాటుగా ఇటు ఏపీలో కూడా తమ ఇండస్ట్రీ ఏర్పాటుకు, ఇక్కడి ప్రాంత అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తే ఇక్కడి ప్రజలకు కూడా ఇండస్ట్రీ మీద మరింత గౌరవం పెరుగుతుంది అనేది గ్రహించాలి. ఆ దిశగా ఇండస్ట్రీ అడుగులు ముందుకు వేయాలని అటు ఏపీ ప్రభుత్వం తో పాటుగా ఇక్కడి ప్రజలు సైతం ఆశగా ఆకాంక్షిస్తున్నారు.