
రాష్ట్ర విభజనలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం తిరుమల ఆంధ్రాకు దక్కడంతో, తిరుమలకు ధీటుగా తెలంగాణకు ఓ గొప్ప ఆలయం ఉండలని కేసీఆర్ భావించి వందల కోట్లు ఖర్చు చేసి యాదగిరిగుట్టని యాదాద్రిగా తీర్చి దిద్దారు.
తిరుమలలో నిత్య కళ్యాణమూర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉండగా, యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. కనుక దేవుడికి, పోటీగా మరో దేవుడిని, దేవాలయాన్ని పోటీగా మరో దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఇదేమీ ఎన్నికలలో పోటీ కాదనే విషయం కేసీఆర్ గ్రహించలేదు.
Also Read – భారత్‌లో పాకిస్తానీలు.. ఓటు బ్యాంక్ రాజకీయాలు!
ఏది ఏమైనప్పటికీ, రాజుగారు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కరువా? అన్నట్లు ఆయన వందల కోట్లు ఖర్చు చేసి యాదగిరి గుట్టని అద్బుతంగా తీర్చిదిద్దారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల అమలు కోసం ఓ పక్క ప్రతిపక్షాల ఒత్తిడి, పదవుల కోసం పార్టీలో నేతల ఒత్తిడి నానాటికీ పెరిగిపోతూనే ఉంది.
Also Read – నారాయణ.. శల్యసారధ్యం చేస్తున్నారా?
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని సిఎం రేవంత్ రెడ్డి పదేపదే చెపుతూనే ఇవాళ్ళ రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. వాటిలో హామీలకు బాగానే కేటాయింపులు జరిపారు. వాటికి అవసరమైన సుమారు లక్ష కోట్లు ఏవిదంగా సమకూర్చుకుంటారో తెలీదు కానీ ప్రస్తుతానికి అ బడ్జెట్ కేటాయింపులు చూపిస్తూ ప్రతిపక్షాలను ఎదుర్కోవచ్చు.
ఇక యాదగిరిగుట్టకి తిరుమల టీటీడీ తరహా పాలక మండలి ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెపుతూనే ఉన్నారు. ఆ ప్రకారమే 18 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటుకి నేడు శాసనసభలో ఆమోదముద్ర వేశారు.
Also Read – వైసీపీ నేతల రిమాండ్ కష్టాలు…
టీటీడీ పాలక మండలిలో రాజకీయ నాయకులు, వారు చేసే రాజకీయాలతో తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందని ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. కనుక కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నిరుద్యోగుల కోసం యాదగిరిగుట్టకు పాలక మండలి ఏర్పాటు చేసినా అలాగే జరుగుతుంది.
యాదగిరిగుట్టకు పాలకమండలి లేకపోయినా ఆలయ ఈవో నేతృత్వంలో ఓ కమిటీ ఉంది. దశాబ్ధాలుగా అదే అన్ని వ్యవహారాలు చక్కగా చూసుకుంటున్నప్పుడు, పాలక మండలి ఏర్పాటు చేసి పవిత్రమైన యాదగిరిగుట్టలో కూడా రాజకీయ కాలుష్యం వ్యాపింపజేయడం అవసరమా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.