GST Income Because of Jagan

అత్తాకోడళ్ళు విమర్శించుకోవాలనుకుంటే సాకులు కరువా?అన్నట్లు సిఎం చంద్రబాబు నాయుడుని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శించేందుకు జగన్‌, ఆయన సొంత మీడియా కాసుకుకూర్చుంది. కనుక ఎవరింట్లో అత్తా కోడళ్ళు కొట్టుకున్నా, చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు భద్రత, మనశాంతి కరువయ్యాయని విమర్శించేస్తుంటారు.

ఈ ఏడాది జనవరిలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ ఆదాయం సున్నాకు పడిపోయిందంటూ వైసీపీ సొంత మీడియాలో కధనం కూడా అటువంటిదే. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్, బిహార్‌ రాష్ట్రాల జీఎస్టీ ఆదాయం గత రెండు సంవత్సరాలుగా 8 నుంచి 20 శాతం వరకు పెరగగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ ఆదాయం ఏమాత్రం పెరగలేదని కనిపెట్టి చెప్పింది.

Also Read – కోటరీ రియాక్షన్ లేదేమిటి?

గతంలో జగన్‌ సంక్షేమ పధకాలు అమలుచేస్తుండటం వలన ప్రజల చేతిలో డబ్బు ఉండేదని కనుక సంక్రాంతి పండుగకు భారీగా ఖర్చు చేస్తుండేవారని, కానీ ఈసారి చంద్రబాబు నాయుడు సంక్షేమ పధకాలు అమలుచేయకుండా, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపైనే ఎక్కువ శ్రద్ద చూపుతున్నందున సంక్రాంతికి ప్రజల చేతిలో డబ్బు లేక షాపింగ్ చేయలేకపోయారని, ఆ కారణంగా జీఎస్టీ శాతం ఏమాత్రం పెరగలేదని జగన్‌ సొంత మీడియా కనిపెట్టి చెప్పింది.

గతంలో జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో వృద్ధిరేటు, జీఎస్టీ శాతం స్థిరంగా సాగుతుండేవి. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్నీ సున్నా అవుతున్నాయని తేల్చి చెప్పేసింది.

Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?

సంపద సృష్టిస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు చివరికి ఉద్యోగులకు నెలనెలా ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని.. అదే జగన్‌ ఉంటేనా..” అంటూ ముక్తాయించింది.

జగన్‌ హయంలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకపోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపేవారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము తీసి వాడేసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టేశారు.

Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?

పంచాయితీలకు కేంద్రం మంజూరు చేసిన నిధులు విడుదల చేసింది. వాడేసుకునేవారు. ఆ కారణంగా పంచాయితీ కార్యాలయాలకు ప్రభుత్వ పాఠశాలలు విద్యుత్ బకాయిలు చెల్లించలేకపోతే విద్యుత్ సిబ్బంది వచ్చి ఫ్యూజులు పీక్కుపోతుండేవారు. అంటే జగన్‌ పాలనలోనే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని అర్దమవుతుంది.

జగన్‌ హయంలో కాంట్రాక్టర్లకి కూడా పెండింగ్ బిల్లులు చెల్లించలేదు. ఆ బకాయిలే రూ.1.30 లక్షల కోట్లు ఉన్నాయని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. సంక్రాంతి పండుగకు ముందు వివిద పెండింగ్ బకాయిల కోసం రూ.6,800 కోట్లు విడుదల చేశారు. వాటిలో కాంట్రాక్టర్లకు రూ.586 కోట్లు కేటాయించారు.




రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని ఇంతగా భ్రష్టు పట్టించేసినా ఏమాత్రం సిగ్గులేకుండా, సంక్షేమ పధకాలు అమలుచేయనందునే జీఎస్టీ శాతం పెరగలేదని వాదించడాన్ని ఏమనుకోవాలి?