పదేళ్ళపాటు తెలంగాణ ఉద్యమాలలో, మరో పదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన నోటికి అదుపే లేదన్నట్లు చెలరేగిపోయేవారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, దేశ రాజకీయాలను కూడా శాశించాలనుకున్నారు.
Also Read – బియ్యం అక్రమ రవాణా: ప్రభుత్వ వైఫల్యమా.. వైసీపీ సమర్దతా?
తెలంగాణ ఉద్యమాలలోనే కేసీఆర్ ‘తెలంగాణ సెంటిమెంట్’కు బీజం వేసి రెండు దశాబ్ధాలలో దానిని పెంచి పోషిస్తూ, దాని ఆధారంగానే రాజకీయాలు చేశారు. చంద్రబాబు నాయుడుపై ఆంధ్రా ముద్ర, మోడీ, అమిత్ షాలపై గుజరాతీ ముద్ర, రాహుల్ గాంధీపై ఉత్తరాది నాయకుడనే ముద్రలు వేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను తాను మాత్రమే కాపాడగలనని ప్రజలను నమ్మించగలిగారు.
కానీ కేసీఆర్ ఎంతగా తెలంగాణ సెంటిమెంట్ రాజేసినా శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో అస్త్ర సన్యాసం చేసిన్నట్లు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి పరిమితమైపోయారు.
Also Read – జగన్, పవన్ ఢిల్లీ పర్యటనలు చాలా డిఫరెంట్ గురూ
అంటే పదవి, అధికారం ఉంటే తప్ప కేసీఆర్ ప్రజల మద్యకు రారా?శాసనసభ సమావేశాలకు హాజరుకారా? అని కాంగ్రెస్ మంత్రులు అడుగుతున్న ప్రశ్నకు 2025లో వస్తారని కేటీఆర్ చెపుతున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఆయన నమ్మిన బంటు, మాజీ ఇంధనశాఖ మంత్రి జగదీష్ రెడ్డి మళ్ళీ ‘ఆంధ్రా మీడియా’ అంటూ వంకర టింకర మాటలు మాట్లాడారు.
Also Read – కాపు మీదున్న చెట్టు కట్టెలపాలయే….
“తెలంగాణ సాధించినందుకు ఈర్ష్య, కక్షతో మీడియాలో ఒక వర్గం ఆయనపై విషప్రచారం చేసింది. ఆ తర్వాత ఆంధ్రా చంక నాకిపోవడానికి కారణం కేసీఆరే అనే కోపంతో మళ్ళీ బురద జల్లుతున్నారు. వాళ్ళు (ఆంధ్ర పాలకులు) తప్పులు చేసుకొని తమ రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటే దానికి కేసీఆర్‌ని నిందించడం, రాజకీయంగా ఆయనని దెబ్బతీయాలనుకోవడం దేనికి?ఆ మీడియాతో కలిసి రేవంత్ రెడ్డి కేసీఆర్‌ని రాజకీయంగా దెబ్బ తీయాలని కుట్రలు చేస్తున్నారు,” అని ఆరోపించారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని, రేవంత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికి చేయని ప్రయత్నం లేదు. డాని ప్రతిఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నారు.
తాము ఏ పార్టీకి, ఎవరికి వ్యతిరేకంగానైనా ఏమైనా చేయొచ్చు. ఏమైనా మాట్లాడొచ్చు. పొరుగు రాష్ట్రాల రాజకీయాలలో వేలు కూడా పెట్టవచ్చు. సొంత మీడియాలో ఏమైనా వ్రాసుకోవచ్చని కేసీఆర్ అనుకున్నప్పుడు అవతలివారు కూడా అదేవిదంగా చేస్తే తట్టుకోవాలి కదా? కానీ తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఉంటాయి బిఆర్ఎస్ పార్టీ నేతల మాటలు.
పైగా కేసీఆర్‌కి, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, రాజకీయంగా ఏమైనా చేసినా వారు తెలంగాణకు వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహులనే ఓ సిద్దాంతాన్ని తయారుచేసి, దానిని ప్రజల నెత్తిన రుద్దడం బిఆర్ఎస్ పార్టీ నేతలకు ఓ దురలవాటుగా మారిపోయింది. ఆ దూరాలవాటుతోనే జగదీష్ రెడ్డి ఈవిదంగా మాట్లాడుతున్నారని భావించవచ్చు.
అధికారంలో ఉన్నా లేకపోయినా బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆంధ్రాపై ఏడుపులు ఆపడం లేదు. ఆంధ్రా నేతలు, ఆంధ్ర మీడియా అంటే ద్వేషం ప్రదర్శిస్తూనే, అదే ఆంధ్రా పేరుతో తెలంగాణ సెంటిమెంట్ రగిలించుకుని రాజకీయంగా మైలేజ్ పొందాలని బిఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తుండటం విడ్డూరంగా ఉంది కదా?