
పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న సామెత మాదిరి పని చేసేవాడికే డిమాండ్లు, వినతులు అన్నట్టుగా బాబు పదవిలోకి రాగానే పోరాటాలతో, లేఖాస్త్రాలతో మీడియాలో ప్రత్యక్షమవుతారు కొంతమంది కుల పెద్దలు.
గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని కానీ అప్పటి ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ని కానీ ఏ ఒక్కరు మాకు ఈ విషయంలో అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయండి అంటూ కనీసం గొంతెత్తి అడగలేని పరిస్థితి.
Also Read – శాసనసభ సమావేశాలు: జగన్ స్టోరీ మామూలే!
గత టీడీపీ హయాంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ కోటాలో కాపులకు ఈడబ్ల్యూఎస్ ద్వారా 5 % రిజర్వేషన్ కలిపించారు. అయితే ఆ తరువాత వచ్చిన వైసీపీ తన హయాంలో అప్పటి సీఎం జగన్ ఈ కోటను పూర్తిగా పక్కన పెట్టేసి కాపులను నో రిజర్వేషన్ జోన్ లోకి తెచ్చేసారు.
అయితే ఆనాడు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పై గొంతెత్తి ప్రశ్నించలేని కుల పెద్దలు మళ్ళీ నేడు లేఖలతో మీడియా ముందుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో సీఎం గా బాబు కల్పించిన కాపులకు 5 %రిజర్వేషన్ తిరిగి కూటమి ప్రభుత్వంలో పునరుద్దరించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖలు రాసారు కాపు సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య.
Also Read – చంద్రబాబు నాయుడు విధానాలే కరెక్ట్?
గత వైసీపీ ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరిగిందని, ఆ అన్యాయానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ, గతంలో కాపు రిజర్వేషన్ విషయంలో కలిసి పని చేద్దాం అంటూ పవన్ తనకిచ్చిన మాట ఇప్పుడు నిలబెట్టుకోవాలంటూ ‘కలం’ పట్టుకున్నారు ఈ ‘కుల’ పెద్ద జోగయ్య. అయితే ఈ పెద్దాయన కనీసం గత ఐదేళ్లల్లో ఈ విషయమై ఏ ఒక్కసారైనా అప్పటి సీఎం జగన్ కు ఒక్క లేఖ అయినా రాయగలిగారా.?
అప్పుడు కాపు కులానికి న్యాయం కావాలి అంటూ కంచం పట్టుకుని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ముద్రగడ గత ఐదేళ్లు అదే సామజిక వర్గం నడ్డివిరిచిన జగన్ కు ఊడిగం చేసారు. దీనితో ఇన్నాళ్లు కాపు కుల పెద్దగా ప్రకటించుకున్న ముద్రగడ మీద ప్రజలలో కానీ ఆ సామజిక వర్గ పెద్దల్లో కూడా నమ్మకం పోయింది. దీనితో ఇప్పుడు ఆ ముద్రగడ స్థానంలోకి జోగయ్య వచ్చి చేరారు.
Also Read – దెబ్బలు పడతాయ్ రాజా..
కాపు రిజర్వేషన్ల అంశం పై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయవలసిన తంతు మొత్తం పూర్తి చేసి ఆ బాల్ ను కేంద్ర ప్రభుత్వ కోర్టు లో వేశారు బాబు, అలాగే ఆయన హయాంలో ఇచ్చిన మాట ప్రకారం కాపు సామజిక వర్గానికి 5 % రిజర్వేషన్ కూడా కల్పించారు. ఇలా సాఫీగా సాగుతున్న ఈ కుల రిజర్వేషన్ల పంచాయితి మళ్ళీ మొదటికి తెచ్చిన జగన్ ను వదిలి ఇప్పుడు కూటమి న్యాయం చెయ్యాలి, బాబు బాధ్యత తీసుకోవాలి, పవన్ కలిసి పోరాటం చెయ్యాలి అంటూ ఈ పెద్దాయన లేఖలు రాయడం వెనుక ఉన్న ఆ రాజకీయం ఏమిటో.?