రెండు తెలుగు రాష్ట్రాలకు వరుణుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. హమ్మయ్య అని ఊపిరి పిల్చుకునే లోపే మళ్ళీ ఉరుములతో ఉలిక్కిపడేలా చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఇంకా కొన్ని ప్రాంతాలలో వరద నీరు ప్రవహిస్తూనే ఉంది.

ఎట్టకేలకు వ్యవప్రయాసాలకోర్చి బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చింది ఏపీ ప్రభుత్వం. దీనితో విజయవాడ నగరంలోకి వచ్చే వరద నీటికి అడ్దుకట్ట పడినట్లే అంటున్నారు అధికార యంత్రంగం. అలాగే బుడమేరు కట్ట ఎత్తు కూడా పెంచే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం.

Also Read – ఐఏఎస్, ఐపీఎస్‌లకి ఆంధ్రా వద్దు.. తెలంగాణ ముద్దు!

అయితే ఇటు ఏపీలో ని విజయవాడ, అటు తెలంగాణలోని ఖమ్మం, మెహబూబాబాద్, భద్రాద్రి కొత్త గూడెం, ములుగు, వరంగల్ జిల్లాలలో వర్షాలు విస్తృతంగా పడడంతో మళ్ళీ భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు గడుపుతున్నారు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు. పైన పడుతున్న వర్షాలతో ఏపీకి వరద ముంపు పొంచి ఉంది.

దీనితో ఏ నిముషం ఎం జరుగుతుందో అనే ఆందోళనతో ఇటు ప్రభుత్వాలు, అటు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే ఇటు ఏపీ ప్రభుత్వం ముంపు ప్రభావిత ప్రాంతాలలో వరద సహాయక చర్యలను వేగవంతం చేసింది.

Also Read – ఏపీకి, టిడిపికి వైసీపి చాలా అవసరమే!

వేలాది వాహనాలతో వరద బాధితులకు నిత్యావసర సరుకులను సిద్ధం చేసి, పంపిణీ మొదలు పెట్టింది. అయితే ఈ సహాయక చర్యలకు వర్ష విఘ్నం ఏర్పడడంతో అటు అధికారులు ఇటు ప్రజలు తీవ్ర అవస్థలను ఎదుర్కుంటున్నారు. లక్షలలో మినరల్ వాటర్ బాటిల్స్ సరఫరా చేస్తున్న ఇంకా నీటి కొరత తీరని సమస్యగా మారుతుంది.

ప్రభుత్వం తో పాటుగా మానవత్వం ఉన్న ప్రతి వారు మేము సైతం అంటూ విరాళాల రూపంలో, బాధితులకు ఆహార వసతులను సమకూర్చే రూపంలో, లేదా వారికీ అవసరమైన రేషన్, వస్త్రాలు అందిస్తూ ప్రభుత్వానికి, బాధితులకు చేయూతగా నిలుస్తున్నారు. అయినా కూడా ఇంకా కొన్ని ప్రాంతాల ప్రజలకు అవసరమైన సదుపాయాలు చేరలేకపోతున్నాయి.

Also Read – ఒక్క ‘దేవర’ కే పట్టిన చిక్కా..?

అయితే దీనికి ప్రధానంగా వర్షం అడ్డంకిగా మారింది. వర్షంతో ముంపు ప్రాంతాలలో వరద నీరు అంతకంతకు పెరుగుతుంది. దీనితో అధికారులు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రకాష్ బ్యారేజ్ కి వరద ఉదృతి తగ్గింది, బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తయ్యింది, ఇక ఒక్కో సమస్యకు పరిష్కారం దొరికింది అనుకునే లోపే మళ్ళీ వర్షాలు రెండు రాష్ట్రాలను చుట్టుముట్టాయి.

ఈ వరదల నేపథ్యంలో వినాయక చవితి వేడుకలు కూడా అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. విజ్ఞాలను తొలగించే ఏకదంతుడు తెలుగు రాష్ట్రాలకు తగులుకున్న ఈ వర్ష విజ్ఞాన్ని తొలగించి రెండు రాష్ట్రాలలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా ఆశీర్వదించాలని ఆశిద్దాం.