
సంక్రాంతి బరిలో దిగిన వెంకటేష్ గేమ్ చేంజ్ చేసి విక్టరీ సాధించి పేరు నిలబెట్టుకున్నారు. అప్పుడే సక్సస్ మీట్ కూడా ఎంజాయ్ చేశారు. డాకూ మహరాజ్ కూడా ఇప్పుడప్పుడే గుర్రం దిగేలా లేడు. ఈ రెండు సినిమాల మద్య ప్రస్తుతం ‘ఆరోగ్యకరమైన కలెక్షన్స్ పోటీ’ నడుస్తోంది.
ఈ రేసులో కూడా వెంకటేష్ విక్టరీ సాధిస్తున్నట్లు కలెక్షన్స్ రిపోర్ట్స్ చెపుతున్నాయి. వీటి కంటే ముందుగా విడుదలైన గేమ్ చేంజర్ కూడా మిశ్రమ స్పందనలు, పైరసీ ఆటుపోట్ల నడుమ ముందుకు సాగుతూనే ఉంది.
Also Read – జగన్ మొదలెట్టేశారు.. విజయసాయి రెడీయా?
ఈ మూడు సినిమాలు విడుదల కాకముందు రెండు తెలుగు రాష్ట్రాలలో దట్టమైన మబ్బులు కమ్ముకున్నట్లు పుష్ప-2 సర్వత్రా ఆవరించి ఉండేది. కానీ సంక్రాంతి సినిమాల హడావుడిలో పుష్ప-2 సౌండ్ పెద్దగా వినిపించడం లేదు. అయినా నష్టం లేదు… ఇప్పటికే కలెక్షన్స్ మూటగట్టుకుంది కనుక!
పుష్ప-2 విడుదలైన 44 రోజుల తర్వాత నేటికీ పుష్ప-2 రీలోడెడ్ అంటూ ఇంకా దూసుకుపోతూనే ఉంది. నేటి నుంచే ఈ సినిమాలో మరో 20 నిమిషాల నిడివిగల ఫిల్మ్ జోడించామని తెలియజేస్తూ ఓ భీభత్సమైన పోస్టర్ విడుదల చేసింది. కనుక దీంతో ఈ నెలాఖరు వరకు ఈదేస్తే, ఓటీటీలో దిగిపోయి రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్ ముగ్గురి సినిమాలు వచ్చే వరకు పుష్పరాజ్ ప్రయాణ బడలిక తీర్చుకోవచ్చు.
Also Read – గెట్ రెడీ..స్టే ట్యూన్డ్ టూ ‘తాడేపల్లి ఫైల్స్’..!
ముగింపుగా ఓ మాట చెప్పుకోక తప్పదు. ఇదివరకు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాలయ్య, పవన్ కళ్యాణ్, టీడీపీతో సంబందం ఉన్న నటులు, దర్శక నిర్మాతల సినిమాలకు అవరోధాలు సృష్టిస్తుండేది.
కానీ ఇప్పుడు సినీ పరిశ్రమతో బలమైన సత్సంబంధాలున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు సిఎం, డెప్యూటీ సిఎంలుగా సంక్రాంతి సినిమాలను ఎంతగానో ప్రోత్సహించినప్పటికీ గేమ్ చేంజర్ ఎదురు దెబ్బలు తింటుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
Also Read – జగన్ 2.0: ఏపీకి, చంద్రబాబుకి మరింత కష్టమే!
సినిమా బాగోక నష్టపోతే అందుకు ఎవరినీ తప్పు పట్టలేము. కానీ కొన్ని శక్తులు పనిగట్టుకొని దెబ్బ తీస్తుండటం వలన గేమ్ చేంజర్ నష్టపోతుండటం చాలా బాధాకరం.
ఓ సినిమా ఏవిదంగా ఉందనే అభిప్రాయం చెప్పడం, సినిమాని దెబ్బ తీసేవిదంగా దుష్ప్రచారం చేయడం రెండూ ఒక్కటి కానే కాదు. ఒకవేళ సినిమా నచ్చకపోతే ప్రేక్షకులే తిరస్కరిస్తారు కదా? పనిగట్టుకొని దెబ్బ తీయడం దేనికి? ఈ పైశాచిక ఆనందం ఎవరికి.. దేనికి?