Anna Canteens

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టగానే రాష్ట్రంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయించారు. దీని కోసం ప్రభుత్వ పరంగా అధికారులు, పార్టీ పరంగా నేతలు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు.

కేవలం రూ.5లకే పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలనుకోవడం చాలా గొప్ప ఆలోచనే. అయితే ప్రస్తుతం కూరగాయలు, నూనెలు బియ్యం, పప్పులు తదితర నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటుతున్నాయి. అవి మున్ముందు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గే అవకాశం లేదు.

Also Read – చంద్రబాబు పాలనకు జీరో మార్కులట మరి…

ముఖ్యంగా జగన్‌ ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులు, వాటి వడ్డీలకే ఖజానా ఖాళీ అయిపోతుంటుంది. ఇంకా టిడిపి, జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుచేయడానికి చాలా భారీగా నిధులు అవసరం ఉంటుంది. అమరావతి, పోలవరం నిర్మాణానికి, రాష్ట్రంలో అభివృధ్ది పనులకు, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు వగైరా చెల్లింపులకు, ప్రభుత్వ నిర్వహణకు నెలనెలా చాలా సొమ్ము అవసరం ఉంటుంది.

ఈ పరిస్థితులలో కూడా నిరంతరంగా రూ.5లకే భోజనం అందించడం అంటే చాలా కష్టమే. వీటి వలన ప్రభుత్వంపై చాలా భారం పడుతుంది. కనుక తక్కువ భారంతో అన్నా క్యాంటీన్లు ఏవిదంగా నిర్వహించవచ్చు? అనే ఆలోచనలు చేస్తున్నారు. దీని కోసం పలువురు పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు. వాటిలో కొన్ని…

Also Read – ఇంతకీ ఆ కేసులో కేసీఆర్‌ ఓడారా… గెలిచారా?

· ప్రజలు తమ పుట్టిన రోజులు, పెళ్ళి రోజులు, పెద్దల జ్ఞాపకార్ధం ఇంకా పండుగలు, పబ్బాల సందర్భంగా అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నదానం చేసేలా ప్రోత్సహించడం.

· అనాధాశ్రమాలకు, వృద్ధుల ఆశ్రమాలకు అన్నా క్యాంటీన్ల ద్వారా ఆహారం అందించేందుకు విరాళాలు అందించేలా ప్రోత్సహించడం.

Also Read – ఇలా కొట్టేవారెవరైనా ఉన్నారా..మళ్ళీ ఆయనే ట్రై చెయ్యాలా..?

· అన్నా క్యాంటీన్లలకు డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేసి వాణిజ్య ప్రకటనలు సమకూర్చుకోవడం.

· ఎన్‌ఆర్‌ఐలు, సినీ, రాజకీయ, పారిశ్రామిక, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు లేదా సంస్థలు అన్నా క్యాంటీన్లను దత్తత తీసుకునేలా ప్రోత్సహించడం.

· సామాజిక బాధ్యతగా కార్పొరేట్ సంస్థలు బాధ్యత స్వీకరించేలా ప్రోత్సహించడం.

· ముఖ్యంగా టిడిపి, జనసేన, బీజేపీ నేతలు అన్నా క్యాంటీన్లు నిర్వహించేలా ప్రోత్సహించడం.

· జిల్లా లేదా మండల స్థాయిలో సెంట్రలైజ్ వంటశాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచే అన్నా క్యాంటీన్లకు, అంగన్వాడీ, పాఠశాలలకు (మధ్యాహ్న భోజన పధకం) ఆహార పధార్ధాలు సరఫరా చేయడం ద్వారా అనేక చోట్ల వంటలు
వండే ఖర్చులు తగ్గించుకోవడం.

· రైతు బజార్లు, డ్వాక్రా మహిళా సంఘాలను వీటితో అనుసంధానం చేయడం.

· ఇటువంటి మంచి కార్యక్రమాలలో ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది.