YS Sunitha

ఒకరి రాజకీయ అవసరానికి మరొకరి పదవి కాంక్షకు బలైపోయిన వైస్ వివేకా హత్య కేసు గత ప్రభుత్వంలో ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు సరికదా తనకున్న అధికారంతో మరో పదడుగులు వెనక్కిలాగారు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్.

తన తండ్రి దారుణ హత్యకు న్యాయం కావాలి, నిందితులకు శిక్ష పడాలి అంటూ గొంతు పోయేలా, కాళ్ళరిగిలే తిరిగిన సునీత ఇప్పుడు ఏపీ హోమ్ మినిస్టర్ అనితను కలుసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో స్థానిక పోలీసులను అండగా పెట్టి మరి అప్పటి ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కుంటున్నవారిని కాపుకాసింది.

Also Read – బుడమేరు పాపం వైఎస్ కుటుంబానిదే… ఇదిగో సాక్ష్యం!

ఇప్పటికైనా తన తండ్రి కేసు త్వరగా దర్యాప్తు పూర్తి చేసి తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ సునీత హోమ్ మంత్రిని కోరారు. అలాగే గత ఐదేళ్లుగా కేసును తప్పుదోవ పట్టించి నిందితులను అండగా నిలిచిన ప్రతిఒక్కరి మీద చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. ప్రభుత్వం తరుపున సునీతకు అన్ని విధాలా అండగా ఉంటామంటూ మంత్రి అనిత హమిచ్చినట్లు సమాచారం.

జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే సునీత వైసీపీ పార్టీ మీద తన అన్న జగన్, ఆయన భార్య భారతి, ఆమె బంధువు అవినాష్ రెడ్డి మీద నేరుగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇప్పుడు జగన్ కు పదవి లేదు, వైసీపీ కి అధికారము లేదు. ఇక తగ్గేదేలేదు అన్నట్టుగా సునీత తన అడుగుల వేగం పెంచనున్నారు. ఇన్నాళ్ళుగా కాస్త స్తబ్దుగా ఉన్న సునీత తన మౌనం వీడి జగన్ కు ఊహించని షాక్ ఇచ్చారు.

Also Read – పవన్ ఇచ్చేశారు… జగన్‌ పుచ్చుకుంటున్నారు!


చంద్రబాబు కూడా హూ కిల్డ్ బాబాయ్ అంటూ అబ్బాయిని పదేపదే ప్రశ్నించే వారు. ఈ ప్రశ్నకు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని సమాధానం చెప్పగలిగితే ఎగిరెగిరి పడుతున్న వైసీపీ నేతలు, రెచ్చకొడుతున్న జగన్ కు చెక్ పెట్టినట్టే అవుతుంది. ఒక షర్మిల జగన్ మీద నిప్పులు చెరుగుతున్న తరుణంలో మరో పక్క సునీత సైలెంట్ గా వైసీపీకి మంట పెట్టె పని మొదలుపెట్టారు.