Narendra Modi

ఈసారి లోక్‌సభ ఎన్నికలలో 400కిపైగా సీట్లు గెలుచుకొని మళ్ళీ మోడీ ప్రధాని అవుతారని బీజేపీ నేతలు చెప్పుకున్నప్పటికీ 4వ విడత పోలింగ్‌ సమయానికి ‘400 సీట్లు’ గురించి గట్టిగా నొక్కి చెప్పడం మనుకున్నారు.

ఆవిదంగా చెప్పుకోవడం ద్వారా దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళాయని, దేశంలో బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలకు తమని ఇరుకున పెట్టేందుకు అవకాశం కల్పించామని బీజేపీ అధిష్టానం గ్రహించిందని ఓ ప్రముఖ మహిళా జర్నలిస్ట్ చెప్పారు. బహుశః అందువల్లే ‘400’కి బదులు ‘భారీ మెజార్టీతో’ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నారనుకోవచ్చు.

Also Read – భువనేశ్వరికి బాలయ్య దీవెనలు… అన్నయ్యకి షర్మిల శాపాలు

అయితే అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. బీజేపీకి 400 సీట్లు ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లు ఎత్తివేసేందుకే అంటూ చేసిన ప్రచారం తెలంగాణలో బీజేపీకి ఎంతో కొంత నష్టం కలిగించింది.

అలాగే కేసీఆర్‌ కూడా ఈసారి గెలిచి అధికారంలోకి రాలేమని బీజేపీకి ముందే తెలుసు. అందుకే 400 సీట్లు అంటున్నారు. కానీ బీజేపీకి 220 కంటే తక్కువ సీట్లు రావచ్చు. ప్రాంతీయ పార్టీలు కలిసి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ లేదా బీజేపీ మద్దతు ఈయక తప్పదని అన్నారు.

Also Read – ఓటమి తర్వాత కూడా కేసీఆర్‌నే ఫాలో అవుతామంటే…

ఆయనకు కేంద్రంలో చక్రం తిప్పాలని కోరిక ఉంది కనుక అందుకు అనుగుణంగా ఈవిదంగా మాట్లాడారని భావించవచ్చు.

అయితే మోడీ పట్ల దేశ ప్రజలలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ, వ్యతిరేకత లేదని ప్రశాంత్ కిషోర్‌ చెప్పారు. కనుక బీజేపీ చెప్పుకున్నట్లు 400 సీట్లు రాకపోవచ్చు కానీ పూర్తి మెజార్టీతోనే మోడీ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ప్రశాంత్ కిషోర్‌ చెప్పారు.

Also Read – ఇంకా తత్త్వం బోధ పడలేదా..? ఇప్పటికైనా కళ్ళు తెరవండి.!

ఆయన అంచనాలకు బలమైన కారణమే ఉంది. ఒకప్పుడు సొంతంగా పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు ఇండియా కూటమిలో ఓ భాగస్వామిగా మిగిలిపోయింది. ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీల మద్య ఎంతో కొంత ఐక్యత ఉన్నప్పటికీ, అది ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మాత్రం కాదనే చెప్పాలి.

కాంగ్రెస్‌ మళ్ళీ పుంజుకుంటే తప్ప అవేవీ బీజేపీని నిలువరించలేవు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సొంతంగా 200-220 సీట్లు గెలుచుకుంటేనే అప్పుడు జగన్‌ వంటివారు కూడా కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు ముందుకు వస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్‌ సొంతంగా అన్ని సీట్లు సాధించడం అసంభవమే అని భావించవచ్చు. కనుక బీజేపీ గెలిచి, మోడీ మళ్ళీ ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశాలే ఎక్కువనుకోవచ్చు.

ఒకవేళ కేంద్రంలో బీజేపీ, ఆంధ్రాలో టిడిపి, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వస్తే, గత చేదు అనుభవాలను, గుర్తుంచుకుని చంద్రబాబు నాయుడు ఈసారి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తారనే భావించవచ్చు.

ముఖ్యంగా అమరావతిని ఆలస్యం చేయడం వలన జరిగిన అనర్ధాలను ప్రధాని నరేంద్రమోడీ కూడా చూశారు కనుక దానిని యుద్ధప్రతిపదికన పూర్తి చేసేందుకు చంద్రబాబు నాయుడుకి పూర్తి సహాయసహకారాలు అందిస్తారు.

మోడీ ప్రధాని అయితే ఏపీకి మేలు కలుగవచ్చు. ఎందువల్ల అంటే ఏపీలో కూడా బీజేపీ బలపడాలంటే టిడిపి, వైసీపిలలో ఏదో ఒకదానిని అడ్డు తొలగించుకోక తప్పదు. టిడిపితో బీజేపీ పొత్తు పెట్టుకుంది కనుక వైసీపిని అడ్డుతొలగించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. అందుకు అనేక కేసులు ఉండనే ఉన్నాయి.

మోడీ మళ్ళీ ప్రధాని అయితే తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి కూడా గండం మొదలైన్నట్లే భావించవచ్చు. ‘ఆగస్ట్ నెలలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడబోతోంది’ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన హెచ్చరికే ఇందుకు నిదర్శనం.

అయితే మోడీని ప్రసన్నం చేసుకునేందుకు ‘పెద్దన్న’ అంటూ రేవంత్‌ రెడ్డి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కనుక రేవంత్‌ రెడ్డి చాకచక్యంగా తన ప్రభుత్వాన్ని ఎంతకాలం కాపాడుకుంటారో చూడాలి.

మోడీ మళ్ళీ ప్రధాని అయితే కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీ కష్టాలు ఇంకా పెరగవచ్చు లేదా బీజేపీ తమతో కలిసి వస్తే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కేసీఆర్‌ సిద్దంగా ఉన్నానని సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. కనుక లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏమైనా జరిగే అవకాశం ఉంది.

చివరిగా ఒక మాట: బీజేపీకి 400కిపైగా సీట్లు వస్తాయని చెప్పుకోగా, ఏపీలో జగన్మోహన్‌ రెడ్డి ఈసారి వైసీపికి 175/25 సీట్లు వస్తాయని నొక్కి చెప్పుకున్నారు. ఈవిదంగా చెప్పుకుని ప్రజలకు దురాభిప్రాయం కలిగించారు. కనుక ఈవిషయంలో బీజేపీ లాగే వైసీపి కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.