India Final Terms to Pakistan

ఈరోజు ప్రధాని మోడీ నివాసంలో త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ తదితరులు సమావేశమయ్యారు.

Also Read – వైసీపీ రాజకీయాలు మారాయి… మరి టీడీపీ?

ఈ సమావేశంలో ట్రంప్‌ మద్యవర్తిత్వం, పాక్‌ కాల్పుల విరమణ ఉల్లంఘన తదితర అంశాలపై చాలా లోతుగా చర్చించారు.

ట్రంప్‌ సూచన మేరకు రేపు(సోమవారం) ఇరు దేశాల డీజీఎంవోలు హాట్ లైన్‌లో చర్చలు జరుపబోతున్నందున, యుద్ధ విరమణకు భారత్‌ షరతులు తెలియజేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Also Read – కేటీఆర్ కు హరీష్ మద్దతు దక్కినట్టేనా.?

కానీ అవి వింటే పాకిస్థాన్‌కు షాక్ తగులుతుంది. 1. పహల్గాంలో పర్యాటకులని హత్య చేసిన ముగ్గురు ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలి. 2. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ని బేషరతుగా భారత్‌కు అప్పగించాలి. ఈ రెండూ మినహా పాకిస్థాన్‌కు మరో దారి లేదని భారత్‌ స్పష్టంగా చెప్పబోతోంది.

ఈ రెండు షరతులకు పాక్‌ ఎట్టి పరిస్థితులలో అంగీకరించదు. ఉగ్రవాదులను అప్పగిస్తే, వారికి పాకిస్థాన్‌ ఆశ్రయం కల్పించి భారత్‌పైకి ఉసి గొల్పి దాడులు చేయిస్తోందనే భారత్‌ ఆరోపణలని పాక్‌ స్వయంగా అంగీకరించి, ధృవీకరించినట్లవుతుంది.

Also Read – యుద్ధం మద్యలో ఈ బేరాలేంటి ట్రంప్‌ గారు?

ఇక భారత్‌ నుంచి ఎలాగైనా కశ్మీర్‌ని విడదీసుకుపోవాలనే దురాలోచనతో దశాబ్ధాలుగా కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌, ఇప్పుడు తన అధీనంలో ఉన్న కశ్మీర్‌ని భారత్‌కి అప్పగించడం అంటే తల కొట్టేసినట్లే!

అదే చేస్తే ఇక పాక్‌ పాలకులు, సైన్యం తమ ప్రజలకు మొహాలు చూపలేరు. ఇక ప్రపంచదేశాలకు ఏమని చెప్పుకోగలరు?కనుక ఈ ప్రతిపాదనకు కూడా పాక్‌ అంగీకరించదు.

అలాగని దయనీయ పరిస్థితిలో ఉన్న పాక్‌ భారత్‌ తడాఖా రుచి చూసిన తర్వాత ఇప్పుడు కూడా యుద్ధం చేయాలను కోదు. ఒకవేళ మొండిగా చేసినా భారత్‌ని ఎదుర్కొని ఎన్నో రోజులు నిలబడలేదు. కనుక పాకిస్థాన్‌ పాలకులకు, సైన్యానికి ఇది అతిపెద్ద అగ్నిపరీక్ష అవుతుంది.

పహల్గాం దాడి కారణంగా ఉగ్రవాదులను మట్టు బెట్టేందుకే ఆపరేషన్ సింధూర్‌ చేపట్టామని భారత్‌ చెప్పినప్పటికీ, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ని తిరిగి స్వాధీనం చేసుకోవడమే అసలు లక్ష్యమని ముందే అనుకున్నాము. ఇప్పుడు మోడీ ప్రభుత్వం “ఇక ముసగులో గుద్దులాటలు లేవు.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ని అప్పగించేసి పాకిస్థాన్‌ని కాపాడుకోండి” అని విస్పష్టంగా చెప్పబోతోంది.

మరి పాక్‌ పాలకులు, సైన్యాధికారులు ఏమంటారో? మద్యవర్తిత్వం చేస్తానంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఏమంటారో? యుద్ధం జరిగితే పాక్‌కి అండగా నిలబడతామని చెపుతున్న చైనా ఏమంటుందో?

ఫినిష్.. ఇక తాడో పేడో తేల్చేయాల్సిందే!