Indian Youtuber Jyoti Malhotra

ప్రపంచాన్ని అరచేతిలో బందించాం, ఆకాశమే హద్దుగా టెక్నాలిజీని వినియోగిస్తున్నాం, పల్లెపల్లెకు ఇంటర్ నెట్ అందుబాటులోకి తెస్తున్నాం అని ఒక పక్క సంబరపడుతుంటే, మరోపక్క అదే అద్భుతాలతో విధ్వంసాలను సృష్టించవచ్చు అంటూ కొందరు సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అసాంఘిక కార్యక్రమాలకు తలపడుతున్నారు.

తాజాగా భారత్ లో జరిగిన పెహాల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత రక్షణ వ్యవస్థ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. అటు దాయాది దేశానికి భారత్ ఆర్మీ సత్తా ఏంటో రుచి చూపించిన భారత్ ఇటు స్వదేశంలో ఉంటూ శత్రు దేశమైన పాక్ కోసం పని చేస్తున్న దేశ ద్రోహుల పై కూడా నిఘా ఏర్పాటు చేసింది.

Also Read – కవితకి కష్టం వస్తే.. బీసీ రిజర్వేషన్స్‌ లేకుంటే లేదు!

ఇందులో భాగంగా జ్యోతి మల్హోత్రా అనే సోషల్ మీడియా యూజర్ భారత నిఘా వ్యవస్థకు చిక్కింది. ట్రావెలర్ వ్లాగర్ అయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తన యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా భారత్ కు సంబందించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని పాకిస్తానుకు చేరవేస్తుంది.

పాక్ ఏజెంట్ గా మారిన ఈ యూట్యూబర్ ఎవ్వరికి అనుమానం రాకుండా సాధారణ యూట్యూబ్ ట్రావెలర్ వ్లాగర్ మాదిరి వివిధ ప్రాంతాలకు తిరుగుతూ అక్కడ వీడియో లను తీసి తన ఛానెల్ లో అప్లోడ్ చేస్తూ ఆ ప్రాంతానికి సంబంధిన పూర్తి వివరాలను పరోక్షంగా ఉగ్రవాదులకు చేరవేస్తున్నట్లు నిఘా అధికారులు గుర్తించారు.

Also Read – అందుకు జగన్‌ని అభినందించాల్సిందే.. వారిపై జాలిపడాల్సిందే!

పెహాల్గమ్ లో ఉగ్రదాడి జరగడానికి మూడు నెలల ముందు కూడా జ్యోతి పెహాల్గమ్ ను సందర్శించి అక్కడ కొన్ని వీడియోలు తీసినట్టు అధికారులు ఆధారాలను సేకరించారు. అలాగే సికింద్రాబాద్ లో జ్యోతి పర్యటిస్తూ వందే భారత్ ట్రైన్ కు సంబంధించిన సమాచారాన్ని ఒక వీడియోలో బంధించారు.

ఇక జ్యోతి అరెస్టు తరువాత ఆమె విచారణలో అధికారులు సేకరించిన వివరాలు చూస్తే స్వదేశంలో ఉంటూ పరాయి దేశం కోసం ఇంతలా దిగజారి ప్రవర్తించే వారు ఉంటారా అన్నట్టుగా జ్యోతి వ్యవహార శైలి కనిపిస్తుంది.

Also Read – షర్మిల ఫోన్‌ కేసీఆర్‌ ట్యాపింగ్ చేయిస్తే నాకేం సంబందం?

పెహాల్గమ్ ఉగ్రదాడి ముందు ఆమె పలుమార్లు పాకిస్తాన్ లో పర్యటించిందని, ఇక భారత్ చేట్టిన ఆపరేషన్ సింధూర్ తరువాత ఢిల్లీలోని పాక్ రాయబారి కార్యాలయం అధికారి డానిష్ తో ఆమె టచ్ లో ఉన్నట్టు అధికారులు నిర్దారించారు.

ఇలా టూరిజం పేరుతో సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానెల్స్ ను రన్ చేస్తూ డబ్బులకోసమో, మరేదైనా కారణం చేతనో పాక్ కు గూఢచర్యం వహిస్తున్న జ్యోతి మల్హోత్ర లాంటి వారు మన చుట్టూ ఇంకెంతమంది ఉన్నారో.? అనే అభద్రతా భావం సామాన్యులలో నెలకొనేలా ఉంది.




అయితే జ్యోతి మల్హోత్రాతో పాటుగా మరో ఆరుగురును అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో ఇంకెన్ని విస్తుపోయే విషయాలు బయటకొస్తాయో చూడాలి.