chandrababu-cabinet-meeting

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలనే మాటలు వినిపిస్తున్నాయి. సిఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా వీటిపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు.

ఆలాగే ఇప్పుడు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, వాటిలో ఉద్యోగాలు, ఉపాధి కోసం నైపుణ్యాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

Also Read – వైసీపి, టిడిపి… దేని ఉచ్చులో ఏది?

గురువారం సచివాలయంలో ఈ అంశాలపై సిఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆలోచనలు, ప్రతిపాదనలు, చేసిన సూచనలు చూస్తే ఎంత అవగాహన, దూరదృష్టితో వ్యవహరిస్తారో అర్దం అవుతుంది.

రాష్ట్రానికి భారీ పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు రప్పిస్తే సరిపోదు. ప్రతీ జిల్లాలో చిన్న, మద్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటు కావాలి. వాటి కోసం ప్రతీ జిల్లాలో రెండేసి చొప్పున రాష్ట్రంలో మొత్తం కొత్తగా 50 పారిశ్రామికవాడలు ఏర్పాటు చేద్దాం. వాటిని ప్రభుత్వ, ప్రైవేట్ (డ్వాక్రా) భాగస్వామ్యంలో తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేయవచ్చు. కనుక చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలని అనుకునేవారికి అందుబాటు ధరల్లో ఉంటాయి.

Also Read – తప్పుకుంటున్నారా…తప్పిస్తున్నారా..?

రాష్ట్రంలో ఏయే జిల్లాలలో ఎటువంటి వనరులు అందుబాటులో ఉన్నాయో, అక్కడ ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే లాభసాటిగా ఉంటుందో, అందుకోసం ఎవరిని సంప్రదించాలో వంటి అన్ని వివరాలను తెలియజేస్తూ “ఎంఎస్‌ఎంఈ యాప్’ త్వరలో అందుబాటులోకి తెస్తాము.

దానిలో ఇప్పటికే ఆయా ప్రాంతాలలో ఉన్న పరిశ్రమల వివరాలతో పాటు కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్న వారి వివరాలు కూడా దానిలో పెడతామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

Also Read – ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి బీజేపీ గెలిచిందేమో… జగన్‌ డౌట్!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తులు, పాడి, ఆక్వా రంగాలను అభివృద్ధి చేసేందుకు ఆయా రంగాలకు అనుబందంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో ‘క్రెడిట్ గ్యారెంటీ ఫండ్’ పధకంలో భాగంగా రూ.900 కోట్లు కేటాయించింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం మరో వంద కోట్లు కలిపి ఆ మొత్తాన్ని ఆర్ధిక సమస్యలలో చిక్కుకున్న ఎంఎస్‌ఎంఈలకు అందించి అవి నిలద్రొక్కుకునేందుకు ప్రభుత్వం తోడ్పడుతుంది,” అని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఒక చిన్న పరిశ్రమ కూడా ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. తద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇందుకు నిదర్శనంగా హైదరాబాద్‌ నగరం మన కళ్ళ ముందే ఉంది.

కనుక చిన్న పరిశ్రమల ఏర్పాటుకి సిఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ ఆలోచనలు, ప్రతిపాదనలు కార్యారూపం దాల్చి ఫలిస్తే ఎవరూ డిగ్రీలు చేతపట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వలసలు పోనవసరం ఉండదు. కేవలం రూ.5,000 జీతం లభించే వాలంటీర్ వంటి చిన్న ఉద్యోగాల కోసం ఎవరూ ఆరాటపడవలసిన అవసరమే ఉండదు.