
ఐపీఎల్ సీజన్ మాంచి రసవత్తరంగా సాగనుంది అనే సమయానికి ఇండో-పాక్ వార్ తెర పైకి వచ్చింది. యుద్ధం మొదలయినప్పటికి, ఒక మ్యాచ్ ను ఆరంభించిన బీసీసీఐ, పరిస్థితులు అంత సానుకూలంగా లేవనే అధికారుల హెచ్చరికలతో ఆ మ్యాచ్ ను నిరవధికంగా వాయిదా వేసింది.
Also Read – జగన్ వార్ డిక్లేర్… ఇవిగో సాక్ష్యాలు!
దీనితో ధర్మశాల వేదికగా పంజాబ్-ఢిల్లీ జట్ల మధ్య మొదలైన మ్యాచ్ కనీసం ఒక్క ఇన్నింగ్స్ కూడా పూర్తి కాకుండానే వాయిదా పడింది. బోర్డర్ దగ్గర్లో ఉన్న పట్టణాలన్నిటిని ఆర్మీ హై-అలర్ట్ జోన్లుగా ప్రకటించిన వేళ, బీసీసీఐ ఈ ఐపీఎల్ ను నిరవధికంగా వారం రోజులు వాయిదా వేసింది.
ఆ వారం రోజుల గడువు ముగిసే సమయానికి యుద్ధ వాతావరమంతా సద్దుమణిగితే ఐపీఎల్ ను యధావిధిగా కొనసాగిచాలనే ఆలోచనలో ఉన్నారు బోర్డు సభ్యులు. అయితే, ఇవాళ రెండు దేశాల మిలిటరీ దళాధిపతులు చర్చించుకోనుండగా, ఈ చర్చల అనంతరం భారత సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలను బట్టి బీసీసీఐ ఏదొక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది.
Also Read – కొమ్మినేనికి ప్రమోషన్ ఖాయమేనా.?
ఇంకా అధికారికంగా రాకపోయినప్పటికీ, ఒకవేళ ఐపీఎల్ మొదలైతే మ్యాచ్లు జరగనున్న మైదానాలు, తేదీలు ఇప్పటికే సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. వచ్చిన రిపోర్ట్స్ బట్టి, మే 16 నుండి మళ్ళీ ఐపీఎల్ ను తిరిగి పునరుద్దరించే ఆలోచనలో ఉన్న బోర్డు, మే 30 న ఫైనల్స్ ను నిర్వహించనున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
రెండు వారల గడువు లోనే మిగిలిన మ్యాచ్ లన్ని పూర్తయ్యే విధంగా, డబుల్-హెడర్స్ ను సైతం బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. బెంగళూరు, హైద్రాబాద్ మరియు చెన్నై మైదానాలను వేదికలుగా ఎంపిక చేసినట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. ఏది ఏమైనా, ఇవాళ ఇరు దేశాల అధికారుల మధ్య జరగనున్న చర్చల పైనే ఐపీఎల్ షెడ్యూల్ ఆధారపడి ఉన్న మాట వాస్తవం.
Also Read – సొంత చెల్లినే పీడించిన జగన్ ప్రత్యర్ధులను ఉపేక్షిస్తారా?