వైఎస్ విజయమ్మ, జగన్, షర్మిల మద్య ఆస్తి పంపకాలపై రచ్చరచ్చ జరిగినప్పుడు జగన్ ఆవేశంగా, “ప్రతీ కుటుంబాలలో ఇటువంటి గొడవలు లేవా? చంద్రబాబు నాయుడే షర్మిలని నాకు వ్యతిరేకంగా ప్రోత్సాహిస్తున్నారు. ఆయన చేతిలో పావుగా మారి ఆమె నాగురించి చెడ్డగా మాట్లాడుతోంది,” అని అన్నారు. అంటే ఇతరుల కుటుంబాలలో వేలు పెట్టడం సరికాదని జగన్ హితవు పలుకుతున్నట్లే కదా?
కానీ ఆయన సొంత మీడియాలో మాత్రం చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్‌కి, నారా లోకేష్-పవన్ కళ్యాణ్‌లకు మద్య ఆధిపత్యపోరు జరుగుతోందని కధలు వండి వార్చేస్తుంటుంది. జగన్ అనుమతి లేకుండా ఆయనకు తెలియకుండానే ఇలాంటి కధనాలు ప్రచురిస్తోందా?అంటే కాదనే అర్దమవుతుంది.
Also Read – సైఫ్‌కి టాలీవుడ్ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?
ఈరోజు సాక్షి ఆన్‌లైన్ సంచికలో “కూటమి చక్రం.. బాబు చేయి జారుతోందా?” అనే శీర్షికతో కూటమి ప్రభుత్వంలో సిఎం చంద్రబాబు నాయుడు క్రమంగా నిసహాయుడుగా మారిపోతున్నారని కనిపెట్టి చెప్పింది. నారా లోకేష్ ప్రభుత్వాన్ని పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకొంటున్నారని, అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా పావులు కదుపుతూ ప్రభుత్వంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని దానిలో పేర్కొంది.
పవన్ కళ్యాణ్ తన అన్నకి మంత్రి పదవి ఇప్పించుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. నిజానికి పవన్ కళ్యాణ్ తన అన్నకి టీటీడీ ఛైర్మన్ పదవి ఇప్పించాలనుకుంటే నారా లోకేష్ చక్రం తిప్పి అడ్డేశారని, అందుకు పవన్ కళ్యాణ్ కూడా చక్రం తిప్పి అన్నకి మంత్రి పదవి ఇప్పించుకుని నారా లోకేష్‌పై పైచేయి సాధించారని కనిపెట్టి చెప్పింది.
Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్ విశాఖపట్నమే!
ఇతరులు తమ కుటుంబం, పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని జగన్ కోరుకుంటునప్పుడు ఆయన (సొంత మీడియా) కూడా అలాగే దూరంగా ఉండాలి కదా? ఇలాంటి కట్టుకధలు వండి వార్చుతూ వారి మద్య చిచ్చు పెట్టడం దేనికి?
వైసీపీలో సజ్జల-విజయసాయి, బాలినేని-చెవిరెడ్డి, పెద్దారెడ్డి-రోజా, అనిల్ కుమార్-కాకణి మద్య ఆధిపత్యపోరు జరగలేదా?విజయమ్మ-జగన్-షర్మిల ఆస్తుల కోసం పంచాయితీలు జరుగలేదా?తమ పార్టీలలో, కుటుంబాలలో ఇన్ని లుకలుకలు పెట్టుకొని అద్దాల మేడలో కూర్చొని దారినపోయే వాళ్ళ మీద రాళ్ళు విసరితే ఏమవుతుంది?ఆలోచించుకుంటే మంచిది.
Also Read – ఆ ఇద్దరు కలిస్తే…ఈ ఇద్దరికీ కడుపు మంటేగా.?
కూటమి ప్రభుత్వంలో నాయకుల మద్య చిచ్చు పెట్టేందుకు ఇలా ప్రయత్నిస్తుంటే ఎప్పటికైనా ఆ చిచ్చు రగులుకోకుండా ఉంటుందా?అప్పుడు గొడవలు విడిపోతే మళ్ళీ మనమే అధికారంలోకి రాలేకపోతామా? అని జగన్ ఆశ పడుతున్నట్లున్నారు.
ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినప్పుడు జగన్ దాని విలువ తెలుసుకోలేక దుర్వినియోగం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మరో ఛాన్స్ కోసం ఇలాంటి పగటి కలలుకంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు.. పాపం!