జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఓ రాజధాని ఏర్పాటు చేయలేకపోయింది… పోలవరం భ్రష్టు పట్టించేసింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది.
జగన్ జగన్ విచిత్ర ధోరణి, రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులను చూసి పరిశ్రమలు, ఐటి కంపెనీలు, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించలేదు.
Also Read – భయపడొద్దని జగన్ చెపుతున్నా సజ్జల వినరే…
రాష్ట్రంలో ప్రతీ రంగాన్ని ఇంతగా భ్రష్టు పట్టించేయగల ప్రభుత్వం మరొకటి ఉండదని జగన్ 5 ఏళ్ళలో నిరూపించి చూపారు. ఇంత గొప్ప నేపధ్యం ఉన్న వైసీపి ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై విమర్శిస్తుండటం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లే అనిపిస్తుంది ఎవరికైనా.
చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి వడ్డించిన విస్తరి వంటి రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని అందిస్తే, జగన్ ఆయనకు కుక్కలు చించిన విస్తరిలా మారిన రాష్ట్రాన్ని అందించారు.
Also Read – సనాతన ధర్మం ఒకే… రాజకీయాలు నాట్ ఒకే!
టిడిపి కూటమి ప్రభుత్వానికి రేపటితో వందరోజుల పాలన పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పటిన మొదటి రోజు నుంచే భ్రష్టుపట్టిన వ్యవస్థలలో చీడపురుగులను ఏరేస్తూ మళ్ళీ వ్యవస్థలను గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టులైన అమరావతి, పోలవరం పనులను పునః ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా చేశారు.
Also Read – కొండా సురేఖా… మమ్మల్ని రక్షించావు కదమ్మా!
జగన్ హయాంలో ఓట్ల కోసమే సకాలంలో పింఛన్లు ఇచ్చేవారు. ఐదేళ్ళపాటు టంచనుగా ఇస్తూనే ఉన్నారు. కానీ నెలంతా పనిచేసిన ఉద్యోగులకు ఏనాడూ సకాలంలో జీతాలు ఇవ్వలేదు!
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాలేకపోవడం వలననే జీతాలు, పెన్షన్స్ ఆలస్యం అవుతుండేవని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు నెలనెలా సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లిస్తోంది కదా?
ఈ వంద రోజులలోనే ఒకదాని తర్వాత మరొకటిగా వరదలు ఊళ్ళని ముంచెత్తాయి. బుడమేరు, ఏలేరు గండ్లు పడితే వాటన్నిటినీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూడ్పించింది. సిఎం చంద్రబాబు నాయుడు ఓ పక్క విజయవాడ వరద బాధితులకు సహాయ చర్యలు పర్యవేక్షిస్తూనే అన్ని పనులు సమాంతరంగా చేయించారు.
సిఎం చంద్రబాబు నాయుడు అన్ని రకాల సమస్యలను, సవాళ్ళను, ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూనే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
చంద్రబాబు నాయుడుకి బదులు జగన్ ఉండి ఉంటే నేటికీ విజయవాడ నగరం వరద నీటిలో మునిగే ఉండేదని స్థానిక ప్రజలే చెప్పుకుంటున్నారు.
ఇన్ని పనులు, ఇన్ని మార్పులు, ఇన్ని విపత్తులు అన్నీ కేవలం వంద రోజులలోనే జరిగాయనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినా జగన్‌కి, వైసీపి నేతలకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు.
మాయాబజార్ సినిమాలో తందాన శాస్త్రి, తాన శర్మలు ఎదుటవారిలో తప్పులు ఎంచాలని ప్రయత్నిస్తూ పదేపదే మొట్టికాయలు తిని అభాసుపాలైన్నట్లే జగన్, వైసీపి నేతలు కూడా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు.