
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-1 ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతుండటంతో ఏ క్షణంలో ఎవరి నెత్తిపై బాంబు పడుతుందో అని అందరూ ఆందోళనగానే ఉన్నారు.
నిన్న వైఎస్ షర్మిల విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్, తన భర్త, తనతో కలిసి పనిచేస్తున్నవారందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయని, ఈ విషయం వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి స్వయంగా తనకు తెలిపారని బాంబు పేల్చారు.
Also Read – జగన్ దండయాత్రలే వైసీపీకి శాపంగా మరబోతున్నాయా?
తన అన్న జగన్, కేసీఆర్ ఇద్దరూ కలిసి తన రాజకీయంగా, ఆర్ధికంగా దెబ్బ తీయాలని చాలా ప్రయత్నించారని ఆరోపించారు. కేసీఆర్ తన ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వివరాలను తన అన్న జగన్మోహన్ రెడ్డికి అందించేవారని వైఎస్ షర్మిల ఆరోపించారు.
ఈరోజు జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు, ఇదే ప్రశ్న అడిగినప్పుడు జగన్ ఏమన్నారంటే, “పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే దాంతో నాకేం సంబంధం? నేను ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు కదా? షర్మిళమ్మ తెలంగాణలో పార్టీ పెట్టుకొని రాజకీయాలు చేసేది కనుక కేసీఆర్ ఆమె ఫోన్ ట్యాపింగ్ చేయించి ఉండవచ్చు. కానీ దాంతో నాకేం సంబంధం?” అని జగన్ ప్రశ్నించారు.
Also Read – టీడీపీ శ్రేణుల ధర్మాగ్రహం…
తెలంగాణలో అసలు ఫోన్ ట్యాపింగ్ జరుగలేదని కేసీఆర్ & కో వాదిస్తుంటే, జరిగి ఉండొచ్చు.. వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు,” అంటూ జగన్ చెప్పడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం నిజమే అని ధృవీకరిస్తున్నట్లు ఉంది.
ఫోన్ ట్యాపింగ్ జరుగడం నిజమే అని జగన్ ఒప్పుకుంటే, కేసీఆర్, జగన్‌ల గురించి వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలు కూడా నిజమే అని అంగీకరిస్తారా?