
జగన్ రెంటపాళ్ళ పర్యటనలో ఆయన కారు కింద నలిగి సింగయ్య అనే ఓ వృద్ధుడు చనిపోగా, ఆ ఊరేగింపు కారణంగా సకాలంలో అంబులెన్స్ ఆస్పత్రి చేరుకోలేకపోవడంతో తెల్లజర్ల మధు (22) అనే యువకుడు గుండెపోటుతో మరణించాడు.
వీరిద్దరి మృతికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ వైసీపీ అధినేత జగన్ వాదించడం విశేషం! అందుకు ఆయన చెప్పిన కారణాలు..
Also Read – చంద్రబాబు నాయుడు మార్క్ చూపితే చాలు!
మాజీ ముఖ్యమంత్రినైన నాకు జెడ్ ప్లస్ భద్రత ఉన్నందున, నేను పర్యటనకు బయలుదేరినప్పుడు పోలీస్ భద్రత కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదే. రోప్ పార్టీ, ఎస్కార్ట్ వాహనాలు, దారి పొడవునా పోలీసులతో భద్రత కల్పించి ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా? ఈ ప్రభుత్వం, పోలీసులు ప్రోటోకాల్ పాటించకపోవడం వలననే ఈ ప్రమాదం జరిగింది.
నా కారు నడుపుతున్న డ్రైవర్‌ని ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. అతను చేసిన తప్పుకు నన్ను ఎలా బాధ్యుడిని చేస్తారు?
Also Read – రాజకీయాలలో మెట్టు దిగడం.. ఇలా కాదు!
సింగయ్య మృతి పట్ల నేను చాలా బాధపడుతున్నాను. వెంటనే అంబటి రాంబాబు, వైసీపీ నేతలను ఆయన ఇంటికి పంపించి ఆర్ధిక సాయం అందించాను. కానీ నా పర్యటనకు ప్రజల నుంచి ఇంత అనూహ్యమైన స్పందన చూసి ఓర్వలేకనే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
జెడ్ ప్లస్ భద్రత కలిగిన ప్రతిపక్ష నాయకుడినైన నేను ప్రజల వద్దకు, పార్టీ శ్రేణుల వద్దకు వెళ్ళకుండా అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇటువంటి కుట్రలు చేస్తోంది.
Also Read – భారత్‌కు శాపంగా మారిన అమెరికా, చైనా?
జగన్ రెంటపాళ్ళ పర్యటనకి పోలీసులు అనుమతించారు. కానీ ఆ గ్రామంలో రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది కనుక ఎక్కువ మందితో వస్తే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని, కనుక 100 మంది, కాన్వాయ్‌లోని మూడు కార్లతో రావచ్చని చెప్పారు.
కానీ పరామర్శకు బయలుదేరి జగన్ వేలాదిమందితో బలప్రదర్శన చేశారు. అప్పటికీ పోలీసులు 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వైసీపీ శ్రేణులను అడ్డుకునేందుకు చాలా ప్రయత్నించారు. కానీ వేలాదిమందిగా తరలిరావడంతో వారిని అడ్డుకోలేకపోయారు.
ప్రభుత్వం, పోలీసులు ఎంత ప్రయత్నించినా వారిని అడ్డుకోలేకపోవడంతో జగన్ ‘యాత్ర విజయవంతం’ అయ్యిందని వైసీపీ గర్వంగా చెప్పుకుంది. అంటే అది పరామర్శ యాత్ర కాదని జగన్ బల ప్రదర్శన యాత్ర అని వైసీపీ స్వయంగా ధృవీకరించినట్లే కదా?
సంక్రాంతి పండుగ తర్వాత ప్రజల మద్యకు వస్తానని ముహూర్తం పెట్టుకున్నది జగన్. కానీ రాకుండా నేటికీ తాడేపల్లి ప్యాలస్‌లో కాలక్షేపం చేస్తూ తనని ప్రజల వద్దకు వెళ్ళనీయకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోందని జగన్ ఆరోపించడం సిగ్గుచేటు.
పోలీసులు వారిస్తున్న వేలాదిమందితో ఊరేగింపుగా వెళ్ళడం తప్పు. కానీ పోలీసులతో రోప్ పార్టీ ఏర్పాటు చేయకపోవడం తప్పు అని జగన్ ఎదురు నిందిస్తున్నారు.
మానవత్వం నా మతం వ్రాసిపెట్టుకోండి అని గొప్పగా చెప్పుకున్న జగన్, తన వాహనం కింద ఓ వృద్ధుడు నలిగి చనిపోతే, కారు దిగి సింగయ్యని ఆస్పత్రికి తరలించకుండా పక్కకు ఈడ్పించేసి ముందుకు సాగిపోయారు.
సింగయ్య తన కారు కింద నలిగి చనిపోతే దానికి కారు డ్రైవరు, ప్రభుత్వం, పోలీసులే బాధ్యులు తప్ప తాను కాదని జగన్ వాదిస్తున్నారు.
ఈ ప్రమాదం ఆంధ్రాలో జరిగింది కనుక ఇలా వితండవాదం చేస్తున్నారు. ఇదే వేరే రాష్ట్రంలోనో వేరే దేశంలోనో జరిగి ఉంటే ఇలాగే వాదించేవారా? జగన్ మాజీ ముఖ్యమంత్రి కనుక అక్కడి ప్రభుత్వం, పోలీసులు ఉపేక్షించేవారా?