Investments For AP in Davos

దావోస్‌ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ. 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రానికి ఒక్కటీ రాలేదని సమాచారం. ఒకవేళ సిఎం చంద్రబాబు నాయుడు బృందం అక్కడ ఏదైనా సంస్థలతో ఒప్పందాలు చేసుకొని ఉండి ఉంటే, ముఖ్యమంత్రి కార్యాలయం తప్పకుండా ఆ విషయం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియస్తుండేది. కానీ లేదు!

దావోస్‌ సదస్సు ముగియడంతో చంద్రబాబు నాయుడు బృందం నేడు తిరుగు ప్రయాణం అవుతోంది. కనుక ఈసారి దావోస్‌ సదస్సు ఏపీకి నిరాశ మిగిల్చిన్నట్లే ఉంది.

Also Read – దెబ్బలు పడతాయ్ రాజా..

సిఎం చంద్రబాబు నాయుడుకి అనేకమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలతో, ఐటి కంపెనీల అధినేతలు, సీఈవోలతో మంచి పరిచయాలున్నాయి. వారితో వరుసగా సమావేశాలలో పాల్గొన్నారు కూడా. సిఎం చంద్రబాబు నాయుడు ఐటి కంపెనీలను, పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహిస్తారనే మంచి పేరు కూడా ఉంది.

రాష్ట్రానికి సంబందించిన ప్రతీ అంశంపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు సుస్థిరమైన ప్రభుత్వం ఉంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విదాల సహాయ సహకారాలు అందిస్తోంది కూడా.

Also Read – వివేకా హత్యతో సంబందం లేకపోతే భయం దేనికి?

అయినా ఈ సదస్సులో సిఎం చంద్రబాబు నాయుడు ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించలేపోయారంటే నమ్మశక్యంగా లేదు. బహుశః ఇలా అనుకోవడం తొందరపాటే అవుతుందేమో కూడా?

ఒకవేళ ఏ కారణం చేతయినా సదస్సులోనే ఒప్పందాలు చేసుకోలేనప్పటికీ ఏపీలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలు బహుశః త్వరలోనే అమరావతికి వచ్చి ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.

Also Read – అల్లు వారి ఇంట మెగా వివాదాలు…!

కానీ సిఎం చంద్రబాబు నాయుడు వంటి గొప్ప అనుభవశాలి, పరిపాలనాదక్షుడు దావోస్‌ సదస్సు నుంచి ఒట్టి చేతులతో తిరిగివస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు.

ఒకవేళ ఇదే నిజమనుకుంటే ఈవిదంగా ఎందుకు జరిగింది? అని నిశితంగా ఆలోచిస్తే 5 ఏళ్ళ జగన్‌ అరాచక విధ్వంస పాలనే కారణం కావచ్చనిపిస్తుంది.

జగన్‌ అరాచక పాలన చూసినవారు మళ్ళీ నేనే అధికారంలోకి వస్తానని ఆయన చెపుతున్నప్పుడు, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సాహసిస్తారని అనుకోలేము. కనుక పారిశ్రామికవేత్తలను ‘జగన్‌ వలన మళ్ళీ ప్రమాదం ఉండదని’ ఒప్పించి వారిచేత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించడం చాలా కష్టమే అని మొదటి నుంచి అందరూ అనుకుంటున్నదే.

కానీ సిఎం చంద్రబాబు నాయుడుకి ఉన్న ఇమేజ్, పరిచయాలు, కేంద్రంలో పరపతి వలన తప్పకుండా వారిని ఒప్పించి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించుకువస్తారని అందరూ గట్టి నమ్మకంతో ఉన్నారు.




ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రంలో ఇంత సానుకూల వాతావరణం ఉన్నా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోతే అది ఖచ్చితంగా ‘జగన్‌ ఎఫెక్ట్’ అనే అనుకోవాల్సి ఉంటుంది. అదే నిజమైతే చంద్రబాబు నాయుడు తిరిగి రాగానే ఆ ఎఫెక్ట్ తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టం చాలా అవసరమే.