ys-jagan-mohan-reddy

ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి. జగన్‌ ఆక్రమాస్తుల కేసుల గురించి అందరూ నెగెటివ్‌గానే ఆలోచిస్తారు తప్ప ఒక్కరూ పాజిటివ్‌గా ఆలోచించరు.

Also Read – సంక్రాంతికి వస్తున్నాం అన్నారు.. మరిచిపోకండి సార్లూ

దాదాపు 12 ఏళ్ళకుపైగా నాంపల్లి కోర్టు మొదలు సుప్రీంకోర్టు వరకు సాగుతున్న ఈ ఆక్రమాస్తుల కేసు విచారణ వలన ఎంతో మందికి ఉపాది, ఆదాయం లభిస్తోంది. కోర్టులు, న్యాయవాదులు, ఈడీ, సీబీఐ అధికారులు, పోలీసులు, జైలు సిబ్బంది ఇంకా అనేక మంది గత 12 ఏళ్ళుగా దీని కోసం పనిచేస్తుందటమే ఇందుకు నిదర్శనం.

ఈ ఆక్రమస్థుల కేసులు గత 12 ఏళ్ళుగా రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని మీడియా సంస్థలకు, వెబ్ సైట్లకు, వివిద వర్గాల సోషల్ మీడియాకి ఇలా కధనాలు వ్రాసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అంతే కాదు సోషల్ మీడియా మేధావులకు తమ అభిప్రాయాలు లేదా వాదనలు వినిపించి అందరినీ ఆకట్టుకుని మేధావిగా గుర్తింపు పొందే అవకాశం కూడా ఈ ఆక్రమాస్తుల కేసులే కల్పిస్తున్నాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే ఈ కేసులతో మరో 12 ఏళ్ళు ‘ఉపాధి హామీ పధకం’గా రన్ చేయగల కెపాసిటీ జగన్‌కి, ఆయన న్యాయవాదులకు ఉంది.కనుక అదేదో వాషింగ్ పౌడర్ వాణిజ్య ప్రకటనలా మరక మంచిదే అని అనుకోకతప్పదు.

Also Read – ఈ ఏడాది ఏపీకి అంతా శుభం… పండుగ చేసుకోవలసిందే!

ఇంతే కాదు.. ఈ ఆక్రమస్థుల కేసుల విచారణలో పురోగతి ఎందుకు కనిపించడం లేదని సుప్రీంకోర్టు ప్రశ్నకు ఈడీ, సీబీఐ న్యాయవాదులు చెప్పిన సమాధానం న్యాయవాదులు, న్యాయ విద్యని అభ్యసిస్తున్నవారు అందరూ తప్పక తెలుసుకోవడం చాలా అవసరమే.

ఈ 11 కేసులపై అనేక ఉప కేసులు దాఖలు చేస్తుందటమే ఆలస్యానికి కారణమని చెప్పారు. ఓకే కేసుపై డజన్ల కొద్ది కేసులు వేస్తూ అసలు కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని ఈడీ, సీబీఐ న్యాయవాదులు చెప్పారు. వారు చెప్పిన ఈ జవాబు విని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆశ్చర్యపోయింది.

Also Read – కేటీఆర్‌.. ఈ సంక్రాంతి పండుగ ఇంట్లోనే…

పురాణాలలో పిట్ట కధలున్నట్లు, ఈ ఆక్రమాస్తుల కేసులకు అనేక ఉప కేసులు తగిలిస్తుండటంతో న్యాయస్థానాలు ఆ మాయ లేదా ఉచ్చులో పడి ముందుకు సాగలేకపోతున్నాయని ఈడీ, సీబీఐ న్యాయవాదులు స్పష్టంగా చెప్పిన్నట్లే కదా? కనుక న్యాయవాద వృత్తిలో ఉన్నవారందరూ ఇటువంటి మెళుకువలు నేర్చుకునే అవకాశం కూడా ఈ ఆక్రమాస్తుల కేసులే కల్పిస్తున్నాయి.

ఈ కేసులలో జగన్‌ బెయిల్ రద్దు చేసి విచారణ వేగవంతం చేయాలని, వేరే రాష్ట్రానికి ఈ కేసులు బదిలీ చేయాలని కోరుతూ ఏపీ డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టినప్పుడు ఈ అద్భుత సత్యం బయటపడింది.




సుప్రీంకోర్టు స్పందిస్తూ ఏయే కోర్టులలో ఈ ఆక్రమస్థుల కేసులకు సంబందించి ఎన్ని పిటిషన్లున్నాయి? అవి ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి?తదితర పూర్తి వివరాలన్నీ రెండు వారాలలోగా ఇవ్వాలని ఈడీ, సీబీఐలను ఆదేశించింది. వాటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఈ కేసుల సంగతి తేల్చేస్తామని సుప్రీంకోర్టు చెప్పింది.