ప్రతీ ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోల పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి. ఈసారి వాటితో పాటు మరో అతిపెద్ద హీరోల బొమ్మలు కూడా విడుదలకాబోతున్నాయి.
ఓ హీరో నేషనల్ కాగా మరో హీరోది ఇంటర్నేషనల్ స్థాయి. వారే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.
Also Read – M9 పాఠకులకు ‘భోగి’ పండుగ శుభాకాంక్షలు..!
ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చొని దేశాన్ని ఏలేస్తానని ప్రగల్భాలు పలికిన తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్, సొంత గడ్డపైనే మొదట శాసనసభ ఎన్నికలలో ఆ తర్వాత వెంటనే లోక్ సభ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఓడిపోయారు.
అప్పటి నుంచి ఫామ్‌హౌస్‌లో యజ్ఞయాగాలు చేసుకుంటూ మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన జనవరిలో రిలీజ్ అవుతారని కేటీఆర్ ఇదివరకే ప్రకటించారు.
Also Read – అమరావతి కష్టాలు భోగి మంటలో కాలినట్టేనా.?
ఆయన రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా కేసీఆర్ రాజకీయాలకు బ్రేక్ చెప్పి సెలవులో ఎటో వెళ్ళిపోయారు. ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చుతామని లేదా కూలిపోతుందని గొప్పగా చెప్పుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొని సంబరాలు చేసుకుంటోంది.
కనుక కేటీఆర్ స్థానంలో కల్వకుంట్ల కవితని దింపాలని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే కేటీఆర్ అలిగి ‘జంప్’ అని కాంగ్రెస్ పార్టీలో గిట్టనివారు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ గుసగుసలని పక్కన పెడితే, జనవరిలో కేసీఆర్ రిలీజ్ పక్కా అనుకోవచ్చు. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
Also Read – వివేకానంద గురించి జగన్ ట్వీట్
కేసీఆర్‌ని రాజకీయ గురువుగా భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా జనవరిలోనే రిలీజ్ కాబోతున్నారు… అని ఆత్మసాక్షి చెప్పేసింది.
చంద్రబాబు నాయుడుకి జగన్ ఎంతో ఉదారంగా ఇచ్చిన 6 నెలల హనీమూన్ పీరియడ్ సద్వినియోగం చేసుకోలేక రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారని కనుక రాష్ట్రాన్ని, దానిలో 40 శాతం ప్రజలను, మిగిలిన పార్టీ కార్యకర్తలని ఆయన బారి నుంచి కాపాడుకోవడానికి జగన్ సంక్రాంతి తర్వాత జనంలోకి బయలుదేరుతున్నారట!
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తీసుకు రావాలని అనుకున్నారు. కానీ ఈ జనాలకు ఏదీ ఓ పట్టాన్న అర్దం కాదు కనుక తొందరపడి ఆయనని దించేశారు.. లేకుంటేనా.. జాతీయస్థాయిలో ఈపాటికి గిరగిరా చక్రం తిప్పుతుండేవారే కదా?కనుక ఆయన పాన్ ఇండియా హీరోనే.
గురువుని మించిన శిష్యుడు జగన్. అదానీతో ఓకే ఒక్క డీల్ చేసుకొని ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయారు. కనుక సంక్రాంతికి నేషనల్, ఇంటర్నేషనల్ హీరోలు బరిలో దిగుతున్నప్పుడు మరే బొమ్మ అయినా వారి ముందు నిలువగలదా?