Jagan Mohan Reddy and KCR Democratic Politics

పార్టీల మద్య రాజకీయాలు సాగితే దాని వలన ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ రాజకీయాలను వ్యక్తిగతస్థాయికి దించితే అందరికీ ఇబ్బందులు మొదలవుతాయి.. అని ఇదివరకు తమిళనాడు ముఖ్యమంత్రులుగా చేసిన జయలలిత, కరుణానిధి నిరూపించి చూపారు. ఆ తర్వాత ఏపీలో జగన్‌, తెలంగాణలో కేసీఆర్‌ నిరూపించి చూపారు.

కేసీఆర్‌ తనకు, తన అధికారానికి, తన పార్టీకి, కుటుంబానికి ఎదురే ఉండకూడదని కొందరిని నయాన్న మరికొందరిని భయాన్న లొంగదీసుకున్నారు. లొంగని ప్రత్యర్ధులని పద్దతిగా ట్రాప్ చేసి దెబ్బ తీసేవారు.

Also Read – ట్రంప్‌-మోడీ భేటీ ఎవరిది పైచేయి?

ఇక్కడ జగన్‌ కూడా శాశ్వితంగా తానే అధికారంలో ఉండాలనే దూరాలోచనతో చంద్రబాబు నాయుడుని, టీడీపీని తుడిచిపెట్టేయడానికి ఎంతగా ప్రయత్నించారు అందరూ చూశారు.

మన ప్రజాసామ్యంలో ఎన్ని ‘లూప్ హోల్స్’ ఉన్నప్పటికీ నేటికీ అది ఇంకా బలంగానే ఉంది. అందుకే ఇద్దరు నియంతలు ఎన్నికలలో ఓడిపోయారు.

Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…

ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ రేవంత్ రెడ్డి ఇద్దరూ తమ ప్రత్యర్ధుల హయంలో జరిగిన అవినీతిని సాకుగా చూపించి వారందరినీ అరెస్టులు చేసి జైలుకి పంపించి ప్రతీకారం తీర్చుకోవచ్చు. కానీ అలా చేసినందుకే కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ నష్టపోయారని వారికి తెలుసు. అందుకే ఇద్దరూ వ్యక్తిగతకక్ష సాధింపులకు పూనుకోకుండా చాలా హుందాగా రాజకీయాలు చేస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ని, ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌ని అరెస్ట్‌ చేసి లోపల వేయాలని రేవంత్ రెడ్డి ఏసీబీకి డెడ్ లైన్ పెట్టొచ్చు. కానీ పెట్టలేదు. అందువల్లే ఆ కేసులలో ఏసీబీ, ఈడీ తమపని తాము చేసుకుపోతున్నాయి. అందువల్లే కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో సేద తీరుతున్నారు. సంక్రాంతికి జైల్లో గడుపుతారనుకున్న కేటీఆర్‌ నేటికీ స్వేచ్ఛగా దీక్షలు చేస్తూ సిఎం రేవంత్ రెడ్డిని తిట్టిపోయగలుగుతున్నారు.

Also Read – అమరావతిలో బసవతారకం….

ఇక్కడ జగన్‌ విషయంలో కూడా సిఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి ప్రత్యేక శ్రద్ద చూపడం లేదు. ఇంతవరకు ఆయనపై ఒక్క పెద్ద కేసు నమోదు కాలేదు. జగన్‌ పాత కేసులలో పెద్దగా చలనం లేదు కూడా.

వైసీపీ నేతలపై కేసులు కూడా ఏదో మొక్కుబడిగా పెట్టామంటే పెట్టామని చెప్పుకోవడానికే అన్నట్లు విచారణ సాగుతోంది. ఏ కేసులోనైనా ఎవరైనా ఇలా లోనికి వెళ్ళి అలా బయటకు వచ్చేస్తున్నారు. ఎందువల్ల అంటే సిఎం చంద్రబాబు నాయుడు ఆ కేసులని ఆయుధాలుగా వాడుకోవాలని అనుకోవడం లేదు.

అందువల్లే జగన్‌, పేర్ని నాని, రోజా వంటివారు నిర్భయంగా సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించగలుగుతున్నారు. వైసీపీ నేతలు నేటికీ టీటీడీ, ప్రభుత్వ కార్యాలయాలలో తమ పనులు చక్కబెట్టుకోగలుగుతున్నారు.

రాజకీయాలను పార్టీల వరకే పరిమితం చేస్తే ప్రతిపక్షాలు కూడా ఇలా స్వేచ్ఛగా, నిర్భయంగా మనుగడ సాగించగలుగుతాయి. కాదని వ్యక్తిగత స్థాయిలో భౌతిక దాడులకు, ప్రతీకారాలకు పాల్పడుతుంటే రాజకీయాలలో ఉన్నవారే కాక వారితో కలిసి పనిచేసిన అధికారులు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మడికట్టుకొని ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన సాగించాలని అనుకుంటున్నప్పటికీ, జగన్‌, కేసీఆర్‌ మాత్రం అలా ఉండాలనుకోరు. కనుక వారిరువురికీ, వారి పార్టీ నేతలకు ప్రజాస్వామ్యం, పద్దతులు నేర్పించాల్సి ఉంటుంది. కానీ అది అసాధ్యం. కనుక భవిష్యత్‌లో వారిని ఏవిదంగా ఎదుర్కోవాలో ఇప్పటి నుంచే ఆలోచించుకోవాలి.