
తెలంగాణలో కేసీఆర్ హయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఆనాడే సిఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని బయటపెట్టిన సంగతి బహుశః చాలా మందికి జ్ఞాపకం ఉండే ఉంటుంది.
కనుక బయట పార్టీ, సొంత పార్టీ, వాళ్ళూ వీళ్ళూ అని చూడకుండా కేసీఆర్ ప్రభుత్వం అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయించినప్పుడు, తెలంగాణలో రాజన్న బిడ్డనని చెప్పుకు తిరుగుతున్న వైఎస్ షర్మిలని ఉపేక్షిస్తారని ఎలా అనుకోగలము?
Also Read – నిర్మాణం ఎలాగూ చాతకాదు కనీసం..
అయినా ఏనుగుకి అప్పడాలు ఓ లెక్కా అన్నట్లు జడ్జీల ఫోన్లే ట్యాపింగ్ చేయించినవారికి వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేయడం ఓ లెక్కా?కానే కాదు.
ఆమె అన్న జగన్‌తో విభేదించి తెలంగాణ వచ్చి సొంత కుంపటి పెట్టుకొని రాజకీయాలు చేస్తూ కేసీఆర్‌ని విమర్శించేవారు. నాటికీ, నేటికీ కేసీఆర్, జగన్ ఇద్దరి మద్య బలమైన బంధం ఉంది.
Also Read – చంద్రబాబు-రేవంత్ సమావేశం వైసీపీ, బీఆర్ఎస్ జీర్ణించుకోగలవా?
కనుక తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి తెలంగాణలో తాను ఎవరెవరిని కలుస్తున్నారో, ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకొని ఆ వివరాలను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేవారని వైఎస్ షర్మిల అనుమానం కలిగింది. అప్పటి నుంచి వేర్వేరు ఫోన్లు ఉపయోగిస్తుండేవారు.
ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారిగా భావిస్తున్న స్పెషల్ బ్రాంచ్ మాజీ అధినేత ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వచ్చి ఈ కేసు విచారణకు హాజరవుతుండటంతో బిఆర్ఎస్ పార్టీలో ఆందోళన మొదలైంది. ఈ కేసులో బాధితుడుగా ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. కనుక ఏదో రోజు వైఎస్ షర్మిల కూడా వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉంది.
Also Read – భువి నుంచి దివికి ఒక తార.. దీవి నుంచి భువికి మరో తార!
ఈ కేసులో తెలంగాణలో ఏం జరుగుతుందనేది అప్రస్తుతం. కానీ ఈ కేసులో వైఎస్ షర్మిల కూడా విచారణకు హాజరయ్యి ఇదే విషయం చెపితే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు జగన్మోహన్ రెడ్డి మెడకు కూడా చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్మోహన్ రెడ్డి మెడకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.