jagan-mohan-reddy Lies to save Cadre

జగన్ రాజకీయాలు ఎప్పుడు ఉహాజనితంగానే ఉంటాయనిపిస్తుంది. గత ఎన్నికలలో వైసీపీ వై నాట్ 175 నినాదం విన్నా, ఇప్పుడు వచ్చే 25 , 30 ఏళ్ళు మనదే ప్రభుత్వం అంటున్నా వినటానికి పార్టీ కార్యకర్తలు ఆనందాన్ని ఇచినప్పటికీ అవి కార్యరూపం దాల్చవనేది జగమెరిగిన సత్యమే.

అయినా కూడా జగన్ తన పార్టీ క్యాడర్ ను, లీడర్లను కాపాడుకుడానికి ఇలాంటి కల్లబొల్లి కబుర్లు చెపుతూ కాలక్షేపం చేస్తున్నారా.? గత ఐదేళ్లు మన ప్రభుత్వంలో ప్రజల కోసం నిత్యం బటన్లు నొక్కుతూనే వచ్చాం. అయినా కూడా ఓడిపోయాం అంటే మనం అబద్దాలు చెప్పకపోవడం, ప్రజలను మాయమాటలతో మోసం చేయకపోవడమే అంటూ పార్టీ కార్యకర్తలు భ్రమలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు జగన్.

Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?

ఇప్పటికే టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యింది, రాబోయేది జగన్ 2.0 పాలన, ఇక ఆ పై 25 ,30 ఏళ్ళు మనదే ప్రభుత్వం, తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టేదిలేదు అంటూ పార్టీ కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ చెపుతున్నవేంటి.? అసలు 30 ఏళ్ళ పాటు ఏపీలో వైసీపీ ఏకచక్రాధిపత్యం సాధ్యమేనా.?

ఆ విషయానికి వస్తే వైసీపీ కే కాదు టీడీపీ కి కూడా అది సాధ్యం కానీ పనే. తెలంగాణలో పదేళళ్ అపాటు ప్రతిపక్షమనేదే లేకుండా చేసిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఇరాక్ ఏపీలో కూడా గత ఐదేళ్లు ప్రతిపక్ష పార్టీలను తన అధికారంతో నిర్బంధించిన జగన్ చివరికి అదే ప్రతిపక్ష హోదా కోసం టీడీపీ తో బేరాలాడుతున్నారు.

Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!

రాజకీయాలలో ఏ పార్టీ శాశ్వత అధికారాన్ని చేపట్టలేదు. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న జగన్ చెప్పేవి అబద్దాలు కాకా మరేమిటి.? దీనితో ఓటమితో వైసీపీ ఆత్మ విశ్వాసం పోయినా..జగన్ అతి విశ్వాసం మాత్రం పోలా..వై.? అంటే జగన్ ఇంకా ఏపీ ప్రజలను తానూ చెప్పిందల్లా నమ్మే గొర్రెల్లా భావిస్తున్నారా.? లేక తాను చెప్పిందే వాస్తవం అనే భ్రమలో పార్టీ కార్యకర్తలతో పాటుగా సామాన్య ప్రజానీకాన్ని కూడా నమ్మించగలను అనే కలలో బతుకుతున్నారా.?

నిజంగా ప్రజలకు జగన్ మాటల పై నమ్మకం ఉన్నా, వైసీపీ విధానాలు నచ్చినా ఇప్పుడు వైసీపీ ఇటువంటి దీన స్థితిలో ఉంటుందా.? పార్టీ ని కాపాడుకోవడానికి, నాయకులను నిలబెట్టుకోవడానికి, క్యాడర్ ను ఆకట్టుకోవడానికి తప్ప జగన్ మాటలు వాస్తవంలో ఆ పార్టీకి మేలు చేకూర్చగలవా.? ఇప్పటికైనా జగన్ తను చెప్పడం కాకుండా పార్టీ శ్రేణులు చెప్పే వాస్తవాలను వినడం నేర్చుకోవాలి.

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?

అలాగే ప్రజా క్షేత్రంలో ఉన్న పార్టీ వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలి. లేకుంటే వచ్చేది మనమే, 25 ఏళ్ళు మన ప్రభుత్వమే అనే నినాదాలు కూడా వై నాట్ 175 మాదిరి పగటి కలగానే మిగులుతుంది. అయితే అబద్దాలు చెప్పకపోవడం ఫలితంగానే ఈ ఓటమి అన్న జగన్ ఈ విషయాల మీద వాస్తవాలను ప్రజలకు వివరించగలరా.? గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు ఎక్కడ.?




నారా సుర రక్త చరిత్ర అన్న వివేకా హత్యకు న్యాయం ఏది.? అమరావతే ఏకైక రాజధాని అన్న జగన్ హామీ విశాఖకు ఎందుకు చేరింది.? చెల్లి షర్మిల అడిగే ప్రశ్నలకు, సునీత చేస్తున్న ఆరోపణలకు వాస్తవాలను వివరించగలరా.? గత వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు, పెట్టిన తాకట్లు ప్రజలకు చెప్పగలరా.? ఈ అన్ని విషయాల మీద జగన్ చెప్పినవి అబద్దాలు కాబట్టే వైసీపీ ప్రతిపక్ష హోదా కోసం కూడా పాకులాడుతుంది.