
మాట తప్పని మడమ తిప్పని వాడు.. విలువలు, విశ్వసనీయతకు పేటెంట్ హక్కులు కలిగున్న ఏకైక వ్యక్తి.. అబద్దాలు చెప్పడం చాతకాక ఎన్నికలలో పార్టీని ఓడించేసుకున్న అమాయకుడు… కడిగిన ఆణిముత్యం…
“ఇంత ఇంట్రడక్షన్ అవసరమా?జగన్ అని చెప్పొచ్చుగా”… అడిగాడు కామన్ మ్యాన్.
Also Read – వైసీపీ కి జనసేన… బిఆర్ఎస్ కు బీజేపీ..?
“మా భక్తి పారవశ్యం అలాంటిది… జగనన్న గురించి ఎంత చెప్పుకున్నా మాకు తనివి తీరదు…” జవాబిచ్చాయి వైసీపీలు.
“అవునా…. గత ఐదేళ్లుగా 175కి 175 మనవే అంటూ జగనన్న మీ చెవుల్లో క్యాబేజీ పూలు పెడుతూ మభ్యపెట్టాడు కదా?”
Also Read – జగన్, చంద్రబాబు: ఇద్దరు భక్తుల కధ!
“మీరందరూ గొర్రెలు. అందుకే ఎంత చెప్పినా అర్దం కాదు. అన్న చెపుతూనే ఉన్నాడు కదా.. ఈవీఎంలు వల్ల ఓడిపోయామని.. మా సింగిల్ సింహాన్ని ఒంటరిగా ఎదుర్కునే ధైర్యం లేక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేతులు కలపడం వలన ఓడిపోయామని, చంద్రబాబు నాయుడు, మోడీ కలిసి కుట్రలు చేయడం వలన ఓడిపోయామని… ఎన్నికలు పారదర్శకంగా జరపకపోవడం వలన ఓడిపోయామని… అబద్దాలు చెప్పడం చాతకాక ఓడిపోయామని… వినడం లేదా?”
“ఇంతేనా ఇంకెవైనా ఉన్నాయా? కర్ణుడు చావుకి వంద కారణాలన్నట్లు వైసీపీ ఓటమికి జగన్ కారణం కాదంటారు.. అంతేనా?”
Also Read – జగన్ మోడల్ బెస్ట్ అంటున్న రేవంత్ రెడ్డి!
“అవును అంతేగా అంతేగా!”
“ఇంత అమాయక చక్రవర్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పార్టీని గెలిపించుకోలేకపోయాడు కదా?ఇప్పుడు కేవలం 11 మందే వెంట ఉన్నారు. వచ్చే ఎన్నికల వరకు ఎంతమంది వెంట ఉంటారో.. ఎంతమంది లోపల, బయట ఉంటారో .. తెలీదు. మరి మళ్ళీ గెలిచి ఎలా ముఖ్యమంత్రి అవుతానంటున్నాడు.. మీ జగనన్న?”
“పోలవరం గురించి మా అంబటికి తెలియన్నట్లే, మా జగనన్న రాజకీయాల గురించి మీకూ తెలియదు. టీడీపీ, జనసేన నేతలకి మద్య, చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్‌కి మద్య, పవన్ కళ్యాణ్‌కి నారా లోకేష్‌కి మద్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు కదా?
చంద్రబాబు నాయుడు తనలా అప్పులు చేసైనా, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాయినా సంక్షేమ పధకాలు ఇవ్వలేకపోతున్నారని.. కనుక మిగిలిన 60 శాతం ప్రజలు కూడా తనవైపే చూస్తున్నారని మా అన్న చెపుతూనే ఉన్నారు కదా?
జమిలి ఎన్నికలు వస్తాయని చెపుతూనే ఉన్నారు కదా? అరటిపండు ఒలిచి చేతిలో పెట్టిన్నట్లు ఇంత చక్కగా చెపుతుంటే ఇంకా అర్దం కాకపోతే మీ ఖర్మ,” విసుకున్నాయి వైసీపీలు.
“ఓ అలాగా? అయితే రాబోయే 30 ఏళ్ళు మీ అన్నే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు.. అంతేనా?
“అవును.. అంతేగా అంతేగా…”
“అంటే ఇది 175/175 లాంటి మరో పువ్వు కాదుగా?”
“ఏమిటీ పిచ్చి ప్రశ్నలు? మా అన్న.. మా చెవులు.. మా ఇష్టం! ఆయన మా చెవిలో గుమ్మడి ఫూలే పెడతారో.. క్యాలీఫ్లవర్ ఫూలే పెడతారో మీకెందుకు?అయినా చెవిలో పూలు పెట్టించుకునేందుకు మాకు లేని అభ్యంతరం మీకెందుకు?”
“అవును నిజమే! సంతోషంగా పెట్టించుకోండి.”