Jagan Mohan Reddy real Navaratnalu

నవరత్నాల పేరుతో 2019 లో వైస్ జగన్ చేసిన ఎన్నికల ప్రచారం వైసీపీ కి నాడు అధికారాన్ని కట్టబెట్టింది. అయితే ఆ నవరత్నాల అమలు కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్ చేసిన నవ విధ్వంసాలు అదే వైసీపీ ని అధికారానికి దూరం చేసాయి.

అయితే ఇప్పటి వరకు నవరత్నాలు అంటే అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, వైస్సార్ రైతు బందు,పేదలందరికీ ఇళ్ళు, వైస్సార్ ఆసరా, పింఛన్ల పెంపు, ఫీజు రియంబర్స్ మెంట్, జలయజ్ఞం, మధ్య నిషేధం….అనుకున్న వారికీ ఇప్పుడు ఏపీలో వెలుగులోకి వచ్చిన లిక్కర్ స్కాం తో జగనన్న అసలు నవరత్నాలు ఎమోటి బయటకొచ్చింది.

Also Read – అమ్మ ఒడి..తల్లికి వందనం.బటన్ లేదా.?

తవ్వేకొద్దీ కలుగులో నుంచి ఎలకలు బయటకొచ్చినట్టుగా, సిట్ విచారణ చేసే కొద్దీ వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ అవినీతి వెలుగులోకి వస్తుంది. ఈ అవినీతికి మధ్య నిషేధం అనే ముసుగు తొడిగిన వైస్ జగన్, ఆ తరువాత మాట మార్చి లిక్కర్ వాడకాన్ని తగ్గిస్తాం అంటూ మద్యం రేట్లను అమాంతం పదింతలు పెంచేశారు.

అయితే దీనికి అప్పటి వైసీపీ ప్రభుత్వం చెప్పిన కారణం మందుబాబుల ఆరోగ్యం కాపాడడానికే ఈ అధిక ధరలు, ఆ ధరల వలన మద్యం ప్రియులు ఎక్కువ మద్యాన్ని కొనుగోలుచేయలేక తక్కువ మద్యంతో సరిపెట్టుకుంటారు అనే విచిత్రమైన వాదన తెర మీదకు తెచ్చి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపేలా జీవో లు తెచ్చి మరి లిక్కర్ వ్యాపారం చేసారు నాటి ముఖ్యమంత్రి వర్యులు వైస్ జగన్.

Also Read – కుదిరితే యుద్ధం.. ప్రమాదం ముంచుకొస్తే విలీనం?

అయితే ఆ అధిక ధరల సిద్ధాంతమంతా మద్యం సేవించే వారి ఆరోగ్యం కోసం కాదు, మద్యం అమ్మే వారికి ఆర్థిక మేలు కోసమే అనేది నేడు సిట్ విచారణతో తేటతెల్లమయింది. వైసీపీ హయాంలో దేశంలో ఎక్కడా లేనటువంటి చౌకబారు మద్యం బ్రాండ్స్ అందుబాటులో ఉండేవి.

మద్యం దుకాణాల్లో వారు చెప్పిన బ్రాండే ఉండాలి, తమకు నచ్చిన ధరకే అమ్మాలి అనే నినాదంతో వైసీపీ ప్రభుత్వం మందుబాబుల రక్తంతో, ఆ కుటుంబంలో స్త్రీల సింధూరంతో నాసిరకమైన వ్యాపారం చేసి కోట్లు కొల్లగొట్టింది. గత ఐదేళ్లు ప్రభుత్వ మద్యం దుకాణాలలో కేవలం నగదు రూపంలోనే అమ్మకాలు జరిగాయంటే దాని వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఇప్పుడు బయటకొస్తున్నాయి.

Also Read – సంక్షేమ పధకాలతోనే వైసీపీని హైజాక్.. భలే ఉందే!

ఈ లిక్కర్ స్కాం లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వార్త వైసీపీ ప్రభుత్వ అరాచకత్వానికి, వైసీపీ నాయకుల అవినీతి పరాకాష్టకు అద్దం పట్టినట్టు కనిపిస్తుంది. సిట్ అధికారుల ముందు గత ప్రభుత్వ ఆగడాలన్నీ నిర్మొహమాటంగా బయటపెడుతున్నారు లిక్కర్ కంపెనీ యజమానులు.

తమ పై గన్ను గురి పెట్టి మరి అప్పటి ప్రభుత్వ పెద్దలు తమ నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారంటూ ఒక మద్యం వ్యాపారి అధికారుల ముందు తన గోడు వెళ్లబుచ్చుకున్నారు. అయితే ఈ అరాచకానికి సూత్రదారులు, పాత్రధారులు మరెవరో కాదు వైస్ జగన్ కు అత్యంత ఆప్తుడు, వైస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి వైస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైస్ భాస్కర రెడ్డి అనే విషయం వెలుగులోకి వచ్చింది.

దీనితో అసలు ఈ కేసుకు సంబంధించి ఇంకెంతమంది వైసీపీ నేతలు బయటకు వస్తారు మహాప్రభో అంటూ నోరెళ్లబెడుతున్నారు సామాన్య ప్రజానీకం. ఇప్పటికే ఈ కేసులో అనేకమంది వైసీపీ నాయకులు అరెస్టయ్యి జైల్లో రిమైండ్ ఖైదీలుగా ఊసలు లెక్కపెడుతున్నారు.

మరికొంతమంది ముందస్తు బైళ్ళు తెచ్చుకుని అరెస్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకొంతమంది కేసు విచారణకు సహకరిస్తూ అధికారుల ముందు హాజరవుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో బయటకొచ్చిన వారి పేర్లు….

విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, కసి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీథర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తో పాటుగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తో కలిపి మొత్తం ఈ కేసులో ఉన్న వైసీపీ నవరత్నాలు బయటకొచ్చారు. అయితే ఇప్పటి వరకు బయటకొచ్చిన పేర్లలో సింహ భాగం వైస్ జగన్ సామజిక వర్గానికి చెందినవారిదే కావడంతో గత ప్రభుత్వంలో ఆర్థికంగా అందలం ఎక్కిందెవరో ఇప్పడు అందరికి అర్ధమవుతుంది.




జగన్ పేద ప్రజల కోసం నొక్కిన నవరత్నాల బటన్ల కన్నా పదింతలు ఈ పేద నవరత్నాల లిక్కర్ స్కాం నిందితుల కోసం నొక్కినట్టు కనిపిస్తుంది. మధ్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ స్థాయిలో లిక్కర్ స్కాం కి తెరలేపిందో చూస్తుంటే 2024 ఎన్నికల ముందు తాడేపల్లి జగన్ ప్యాలస్ లో డబ్బుల కంటైనర్లు అంటూ జరిగిన ప్రచారం తెరమీదకొస్తుంది.