Praja Vedika

నాడు చంద్రబాబు నాయుడుని జగన్‌ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు, మాజీ మంత్రి రోజా తదితర వైసీపి నేతలు స్వీట్లు పంచుకొని పండగ చేసుకున్నారు. కానీ అప్పుడు హైదరాబాద్‌తో సహా దేశవిదేశాలలో పనిచేసే ఐ‌టి ఉద్యోగులు, వివిద పార్టీల నేతలు, సామాన్య ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.

ఇప్పుడు ఎన్నికలలో జగన్‌ ఓడిపోయినప్పుడు వైసీపి నేతలు, వారి సానుభూతిపరులు మాత్రమే శ్రద్దాంజలి ఘటిస్తున్నారు.

Also Read – నాడూ నేడూ.. జగన్‌ ఫెయిలే?

కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, సినీ పరిశ్రమకు చెందినవారు, అమరావతి రైతులు, నిరుద్యోగులు, పారిశ్రామికవేత్తలు, సామాన్య ప్రజలు రాక్షస పాలన నుంచి విముక్తి పొందిన్నట్లు పండగ చేసుకుంటున్నారు.

జగన్‌ అందరికీ మేలు చేసిన్నట్లయితే ప్రజలు తమని ఎందుకు ఇంత దారుణంగా ఓడించారు? తాము ఓడిపోతే రాష్ట్రంలో అన్ని వర్గాలవారు ఎందుకు పండగ చేసుకుంటున్నారు?అని ఆలోచించి ఉంటే వైసీపి నేతలు ఎవరూ ప్రజలకు మొహం చూపించలేరు.

Also Read – వైసీపీ రాజీనామాలు.. టీడీపీకి నష్టమే?

కానీ మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ “మేము ప్రజలకు మేలే చేశాము తప్ప ఏ తప్పు చేయలేదు. కనుక ఓడిపోతే మేమేందుకు సిగ్గుపడాలి?గర్వంగా తలెత్తుకొని ప్రజల మద్యకు వస్తాను. మేలు చేసిన మమ్మల్ని ఓడించినందుకు ఆనక ప్రజలే బాధపడతారు,” అని మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయిపోయారు.

సోషల్ మీడియాలో కూడా వైసీపి ఓటమిని నెటిజన్స్ పండగలా చేసుకుంటున్నారు. వారి చర్చలలో ఓ ఆసక్తికరమైన ప్రతిపాదన వచ్చింది.

Also Read – అల్లు ను అరెస్టు చేయగలిగారు కానీ ఆర్జీవిని పట్టుకోలేకపోయారు..!

అదేమంటే… జగన్‌ ముఖ్యమంత్రిగా చేపట్టగానే ఉండవల్లి కూల్చివేసిన ప్రజావేదికని తొలగించకుండా, దానిని అలాగే జగన్‌ విధ్వంస పాలనకు చిహ్నంగా ఉంచేయాలని, ఈ 5 ఏళ్లలో జగన్‌ చేసిన విధ్వంసాల ఆనవాళ్ళన్నిటినీ కూడా తెచ్చి అక్కడ పెట్టి ‘జగన్‌ మ్యూజియం’గా మార్చాలని సూచించారు.

ప్రజలు జగన్‌ వంటివారికి ‘ఒక్క ఛాన్స్’ ఇస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏవిదంగా దెబ్బతిందో భావితరాలకు కూడా తెలిసేలా ఆ మ్యూజియం ఉండాలని మరికొందరు సూచించారు.

జగన్‌ మ్యూజియం పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేయాలని కొందరు, అక్కడ జగన్‌ విధ్వంసం తాలూకు ఫోటో ఎగ్జిషన్ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.




కేవలం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మేలు చేయడం కోసం ఈ భూమ్మీద పుట్టిన దైవదూత జగన్‌ ఓడిపోతే ఇంతమందికి సంతోషం కలుగుతోందా?చాలా ఆశ్చర్యంగా ఉందే!