
జగన్, వైసీపీ నేతలు, వారి సొంత మీడియా కూటమి ప్రభుత్వం, దాని పాలన, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి గురించి ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నా సిఎం చంద్రబాబు నాయుడు వాటన్నిటికీ మాటలతో కాకుండా చేతలతోనే సమాధానాలు ఇస్తుండటం విశేషం.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ ప్రశ్నకు జవాబుగా కేంద్రం నుంచి నిధులు విడుదల చేయించారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని విశాఖకు రప్పించి ఆయన చేతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడేందుకు తాము ఎంతగా కృషి చేశామో చెప్పించారు.
Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?
ఓ పక్క ఎన్నికల హామీల గురించి వైసీపీ దుష్ప్రచారం చేస్తుంటే, ఒక్కో పధకాన్ని ప్రారంభిస్తున్నారు. ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్ గురించి పోరాటానికి వైసీపీ సిద్దమైతే నిధులు విడుదల చేయడంతో వైసీపీకి ఏం చేయాలో పాలుపోక ఎన్నికల కోడ్ కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నామని సర్ధి చెప్పుకోవలసి వచ్చింది.
జగన్ 5 ఏళ్ళలో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రప్పించలేకపోయారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు కేవలం 8 నెలలలోనే సుమారు రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, భారీ పరిశ్రమలు రప్పించడమే కాక వాటన్నిటినీ ప్రధాని మోడీ చేతే శంకుస్థాపన చేయించేసరికి వైసీపీ నోటికి తాళం వేసుకోక తప్పలేదు.
Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..
ఎందుకంటే ప్రధాని శంకుస్థాపన చేసిన పనులు ఒట్టిదే అని వాదిస్తే జనం నవ్వుతారు కనుక. విశాఖ రైల్వే జోన్ గురించి రైల్వేమంత్రి చేసిన ప్రకటన. ఇలాంటిదే మరో ఉదాహరణగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి చకచకా పనులు జరుగుతుండటం.
కానీ వీటి గురించి జగన్‌తో సహా వైసీపీలో ఏ ఒక్కరూ ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు. ఎందువల్ల అంటే వారు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా చేయని ఈ పనులన్నీ సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎంపీలు కలిసి కేవలం 8 నెలల్లో చేసి చూపిస్తున్నారు కనుక.
Also Read – తమిళనాడుకి దూరంగా చంద్రబాబు… దగ్గరవుతున్న పవన్!
కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధి విషయంలో వేలెత్తి చూపలేకపోతున్నారు కనుకనే జగన్ ఐదేళ్ళపాటు బాగా ప్రాక్టీస్ చేసిన సంక్షేమ పధకాల పాటలు పాడుతూ ‘నేనే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటేనా…‘ అంటూ తాడేపల్లి ప్యాలస్‌లో ఒంటరిగా వాపోతున్నారు. ఇదివరకు ఆయన జనాలను ఓదార్చేవారు. ఇప్పుడు పార్టీ నేతలే తాడేపల్లి ప్యాలస్‌కి వెళ్ళి ఆయనని ఓదార్చాల్సి వస్తోంది!