
వైస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనే వార్త విని అనేకమంది వైస్సార్ అభిమానుల గుండెలు ఆగాయి అంటూ వారి కుటుంబాలను పరామర్శించడం వైస్సార్ బిడ్డగా నా బాధ్యత అంటూ అప్పుడు ఓదార్పు యాత్ర మొదలుపెట్టిన జగన్ ఇప్పుడు తన ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలకు, అవినీతికి, దౌర్జన్యాలకు ఊతమిచ్చిన నాయకులను పరామర్శించడానికి, వారిని ఓదార్చడానికి జైలు యాత్రలు చేపడుతున్నారు.
Also Read – కన్నప్ప తీయడం కూడా శివలీలే!
టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి, అందుకు సాక్షిగా నిలబడిన సత్యవర్ధన్ అనే వ్యక్తి కిడ్నాప్, బెదిరింపు కేసులో అరెస్టయి జైలుకెళ్లిన వైసీపీ నేత వల్లభనేని వంశీని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ రేపు బెంగళూరు నుండి విజయవాడ రానున్నట్టు సమాచారం. అయితే వంశీ అరెస్టు తరువాత ఆయన చేసిన ఐదేళ్ల అరాచకం ఒక్కొక్కటిగా మీడియా ముందుకు రావడంతో ఆయన మీద మరిన్ని కేసులు మోపే అవకాశం కనిపిస్తుంది.
తండ్రి చావు మీద రాజకీయం చేసి ‘ఓదార్పు యాత్రలు’ అంటూ ప్రజాక్షేత్రంలో తిరిగిన జగన్ ఇప్పుడు తమ పార్టీ నేతల అరాచకాల మీద, అక్రమాల మీద రాజకీయం చేస్తూ ‘పరామర్శల యాత్రలు’ అంటూ జైళ్ల చుట్టూ తిరిగితున్నారు. గతంలో కూడా ఇదేమాదిరి ఈవీఎం ప్యాడ్ల ధ్వంశం కేసులో అరెస్టయిన పిన్నెలి రామకృష్ణ రెడ్డి ని, ఒక మహిళను హత్య చేసిన కేసులో అరెస్టయి జైలుకెళ్లిన నందిగామ సురేష్ ని పరామర్శించడానికి జైలు కెళ్లిన జగన్ ఇప్పుడు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో అరెస్టయిన వంశీని ఓదార్చడానికి వెళుతున్నారు.
Also Read – జగన్, చంద్రబాబు: ఇద్దరు భక్తుల కధ!
తనకు, తన పార్టీకి కొండంత అండగా నిలబడిన తల్లిని, చెల్లిని కాదని, పార్టీని అడ్డుపెట్టుకుని, అధికారాన్ని చేతిలో ఉంచుకుని సమాజాన్ని కలుషితం చేస్తున్న ఇటువంటి వ్యక్తులకు కాపు కాసే జగన్ రాజకీయ విలువలు ఏపాటివో, ఆయన విశ్వసనీయత ఎంత గొప్పదో చూస్తుంటే అర్ధమవుతుంది అంటున్నారు టీడీపీ శ్రేణులు.
అలాగే తల్లి చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత మాదిరి పార్టీ అధినేతే కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఇక పార్టీ నేతలు దేవాలయాల చుట్టూ తిరిగుతారా.? అన్నట్టుగా వైసీపీ నేతలు ఒక్కొక్కరు న్యాయస్థానాల ముందు మోకరిల్లుతున్నారు. అయితే అప్పుడు జగన్ చేసిన ఓదార్పు యాత్ర పార్టీ బలోపేతానికి నిదర్శనముగా నిలిస్తే ఇప్పుడు జగన్ చేస్తున్న ఈ పరామర్శల జైలు యాత్రలు పార్టీ బలహీనతను సూచిస్తున్నాయి.
Also Read – మంచి ప్రశ్న వేశారు మద్యలో ఆవు కధ దేనికి భూమనగారు?