
ఈనెల 21న విశాఖనగరంలో 3 లక్షల మందితో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం అవడంతో ప్రధాని మోడీ ఎంతగానో సంతోషిస్తూ “ఇటువంటి పెద్ద కార్యక్రమాలను ఏవిదంగా నిర్వహించాలో ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్‌ని చూసి అన్ని రాష్ట్రాలు నేర్చుకోవాలని ప్రశంసించారు.
ఢిల్లీ చేరుకోగానే మళ్ళీ సోషల్ మీడియాలో కూడా ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం తరపున రూ.75 కోట్లు విడుదల చేశారు. సిఎం చంద్రబాబు నాయుడు, ప్రజలు కూడా ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరిగినందుకు, విజయవంతమైనందుకు చాలా సంతోషించారు.
Also Read – నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది.. పరువు కూడా!
ప్రధాని మోడీ ఇంత సంతృప్తి వ్యక్తం చేస్తే, విశాఖలో నిర్వహించిన ఈ కార్యక్రమం తుస్సుమందని బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు మాట్లాడటం చాలా శోచనీయం. ఆ కోపంతోనే సిఎం చంద్రబాబు నాయుడు జగన్ కాన్వాయ్ వ్యవహారం హైలైట్ చేయించి డైవర్షన్ పాలిటిక్స్ చేశారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
అయితే వైసీపీ అనుకూల మీడియాలో అసలు విషయం బయటపెట్టేసింది. సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ నెలరోజులు కష్టపడి విశాఖలో యోగా డే కోసం అన్ని ఏర్పాట్లు చేస్తే, దానికి రెండు రోజులు ముందుగా రెంటపాళ్ళ పర్యటనతో జగన్‌వారిపై సునామీలా వారిపై విరుచుకుపడ్డారని పేర్కొంది.
Also Read – జగన్-చంద్రబాబు పర్యటనలలో ఎంత తేడా!
అందుకే సిఎం చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయి రప్పా రప్పా అంటూ సినిమా డైలాగులు పలికారని సదరు గ్రేట్ మీడియా పేర్కొంది.
జూన్ 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుందని, దానిలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ వస్తున్నారని జగన్‌తో సహా అందరికీ చాలా ముందే తెలుసు.
Also Read – వైసీపీ చీకటి మెయిల్స్…
కానీ ప్రధాని పాల్గొనే ఆ కార్యక్రమంలో వైసీపీ ఫ్లెక్సీ బ్యానర్లు ప్రదర్శించి ఏమైనా హడావుడి చేస్తే పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయని జగన్, వైసీపీ నేతలకు తెలుసు.
కనుక ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి అనే సాకుతో బలప్రదర్శన చేసి, ఫ్లెక్సీ బ్యానర్లతో టీడీపీ నేతలను, ముఖ్యంగా సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లను రెచ్చగొట్టి యోగా డేని విఫలం చేయాలని కుట్ర పన్నినట్లు అనుమానించక తప్పదు.
జగన్ పరామర్శ యాత్ర విజయవంతమైందనే వైసీపీ నేతల మాటలు, ఆ యాత్రయం, యోగా డే గురించి బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు, ఈ రెండింటి గురించి వైసీపీ అనుకూల మీడియాలో పేర్కొన్నది కలిపి చూస్తే, జగన్ పరామర్శ వెనుక దురుదేశ్యం స్పష్టమవుతుంది.