
భారత్-పాక్ ఘర్షణలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైసీపీ తరపున మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ రూ.25 లక్షల చెక్ ఈరోజు అందజేశారు. జగన్ ఆదేశం మేరకు వచ్చి చెక్ అందజేశానని ఆమె తెలిపారు.
ఈ నెల 13న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా, గోరంట్ల మండలంలోని కల్లితండాకు వెళ్ళి మురళీ నాయక్ తల్లితండ్రులను పరామర్శించి వారి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు. అప్పుడే పార్టీ తరపున రూ.25 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. ప్రకటించిన మూడు రోజులలోనే ఉషశ్రీ చరణ్ ద్వారా చెక్ పంపించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
Also Read – రప్పా రప్పా నరుకుతాం.. అవునా.. తప్పేమిటి?
విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు జగన్ ముంపు ప్రాంతాలలో పర్యటించి వరద బాధితుల సహాయార్ధం పార్టీ తరపున కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కానీ ఎవరికీ చెక్కులు ఇచ్చిన దాఖలాలు లేవు.
ఒకవేళ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్ ఇచ్చినా ఇచ్చినట్లు రుజువు ఉండేది. కానీ వరద బాధితులకు వైసీపీ నేతలు మంచి నీళ్ళ ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు వగైరా పంచి పెట్టి, అవన్నీ జగన్ ప్రకటించిన ఆ కోటి రూపాయల పద్దులోనివే అని చెప్పుకున్నారు.
Also Read – జగన్ వార్ డిక్లేర్… ఇవిగో సాక్ష్యాలు!
అప్పటి నుంచే జగన్ ఎప్పుడు ఎవరికి విరాళం ప్రకటించినా టీడీపీ నేతలు కోటి రూపాయల విరాళం గుర్తుచేసి అడుగుతుంటారు. బహుశః అందువల్లే ఈసారి జగన్ వెంటనే రూ.25 లక్షల చెక్కు పంపించి ఉండొచ్చు. కానీ చెక్ చెల్లుతుందో లేదో? మురళీ నాయక్ తల్లితండ్రులే చెప్పాలి.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా నిలుస్తూ @ysjagan గారు రూ.25 లక్షలు ఆర్థిక సాయం
చేతికి వచ్చిన కొడుకుని కోల్పోయిన ఆ కుటుంబాన్ని పరామర్శించి.. పెద్ద కొడుకుగా నేను ఉంటానని మాట ఇచ్చిన వైయస్ జగన్ గారు
వైయస్ జగన్ గారి ఆదేశాలతో ఈరోజు మురళీ… pic.twitter.com/nI6mwPR8p5
— YSR Congress Party (@YSRCParty) May 16, 2025
Also Read – షర్మిల ఫోన్ కేసీఆర్ ట్యాపింగ్ చేయిస్తే నాకేం సంబందం?