
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీసత్యసాయి జిల్లా, గోరంట్ల మండలంలోని కల్లితండాకు వెళ్ళి, భారత్-పాక్ మద్య జరిగిన ఘర్షణలలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్, తల్లితండ్రులని, కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
Also Read – కేసుల వలయంలో కేసీఆర్ కుటుంబం..!
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అనగాని సత్య ప్రసాద్, సత్య కుమార్ సవిత తదితరులు మొన్ననే మురళీ నాయక్ భౌతిక కాయానికి ఘనంగా నివాళులు అర్పించి, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా రూ.25 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. ఇవికాక వారి కుటుంబానికి 300 గజాల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
కనుక ఇవాళ్ళ జగన్ అక్కడకు వెళ్ళినప్పుడు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వీలైతే ఆర్ధిక సాయం అందజేసి ప్యాలస్‌కు తిరిగి వెళ్ళిపోతే హుందాగా ఉంటుంది. కానీ ఎప్పటిలాగే అక్కడ కూడా ఊరేగింపుగా వెళ్ళి, మురళీ నాయక్ మృతికి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తే ప్రజలు అసహ్యించుకుంటారని గుర్తుంచుకోవాలి.