ys_jagan_vijaya_sai_reddy

వైసీపీ కష్టకాలంలో విడిచిపెట్టి పోయిన విజయసాయి రెడ్డికి విలువలు, విశ్వసనీయత లేవని జగన్‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన వెంటనే సమాధానం ఇచ్చారు.

“వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా,” అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..

కనుక ఆ రెండు లక్షణాలు లేని వారిద్దరి మద్య వాటి కోసం పోటీ మొదలైందన్న మాట! జగన్‌ గురించి ఇదివరకే చెప్పుకున్నాం. ఇప్పుడు విజయసాయి గురించి కూడా రెండు ముక్కలు చెప్పుకోవాలి.

వైఎస్సార్ కుటుంబం పట్ల ఆయన చూపిన విధేయత, విశ్వాసాలను ఎవరూ వేలెత్తి చూపలేరు. కానీ జగన్‌ చేసిన ప్రతీ అవినీతి, అరాచకం వెనుక ఆయన ఉన్నారనే సంగతి అందరికీ తెలుసు.

Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?

ఆక్రమాస్తుల కేసులకు ఆయనే సూత్రధారని సీబీఐ ఛార్జ్ షీట్‌లో విజయసాయిని ఏ-2 గా చేర్చడమే ఇందుకు ఉదాహరణ. విశాఖ భూకబ్జాలు అనే వార్త వస్తే పక్కనే విజయసాయి పేరు కూడా కనిపిస్తుండటం మరో నిదర్శనం. కనుక జగన్‌, విజయసాయి ఇద్దరూ సెల్ఫ్ సర్టిఫై చేసుకున్నంత మాత్రాన్న ఆణి ముత్యాలుగా మారిపోరు.

ప్రలోభాలకు లొంగకపోతే ఎంపీ పదవికి రాజినామా చేయాల్సిన అవసరం ఏమిటి? అదీ.. జగన్‌ విదేశంలో ఉన్నప్పుడు అంత హడావుడిగా పార్టీకి, పదవికి రాజీనామా చేయడం దేనికి?అనే ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానాన్ని ఏ ఒక్కరూ నమ్మడం లేదు.

Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!

”కేసులకు భయపడేవాడినే అయితే రాజీనామా చేసేవాడినే కాదు కదా?కానీ చేసి ఇప్పుడు మరింత బలహీనంగా ఉన్నాను కదా?” అని ఆయన ప్రశ్నించారు.

అంటే పదవిలో ఉంటే కేసులను మేనేజ్ చేసుకోగలరని ఆయనే చెప్పడమే కాదు.. ఆక్రమస్థుల కేసులని గత 12 ఏళ్ళుగా, వివేకా హత్య కేసుని గత 5 ఏళ్ళుగా కొనసాగేలా చేసి నిరూపించి చూపారు కూడా. అన్ని కేసులున్నా రాజీనామా చేశారంటే, ఇకపై ఆ కేసుల భయం ఉండబోదనే గట్టి హామీ లభించబట్టే కదా?లేకుంటే మరో నాలుగేళ్ళు పదవీ కాలం ఉన్న రాజ్యసభ సీటుని ఊరికే వదులుకోరు కదా?

ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నా, ఆయనకు కేసులంటే భయం ఉన్నా లేకపోయినా, కేసుల విషయంలో ఏదైనా అభయం పొంది ఉన్నా, ఆక్రమస్థుల కేసుల విచారణ కొనసాగుతూనే ఉంటుంది. కనుక వాటి నుంచి తప్పించుకోగలనని ఆయన అనుకుంటే అవివేకమే అవుతుంది.

ఒకవేళ వాటిలో ఆయన తప్పించుకుంటే తాను ఇరుక్కుంటానని జగన్‌ గ్రహిస్తే చూస్తూ విడిచిపెట్టేస్తారా?కనుక ఇద్దరిలో ఎవరు లోపలకు వెళ్ళినా రెండో వ్యక్తిని కూడా తమ వెంట తోడుగా లోపలకు తీసుకువెళ్ళకుండా ఉండరు. కనుక ఒక్క కేసుల విషయంలోనే కాదు ప్రతీ విషయంలో ఇద్దరికీ సరిసమానమైన ‘విలువ’ ఉంది.