
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీసత్యసాయి జిల్లా, గోరంట్ల మండలంలోని కల్లితండాకు వెళ్ళి, భారత్-పాక్ మద్య జరిగిన ఘర్షణలలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్, తల్లితండ్రులని, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?
ఎప్పటిలాగే వందలాది మందితో అక్కడకు చేరుకున్నారు. ఆయన మురళీ నాయక్ తల్లి తండ్రులను ఓదార్చుతుండగా, జగన్ వెంట ఇంట్లోకి వచ్చిన నేతలు అదేమీ పట్టనట్లు నవ్వుతూ మాట్లాడుకోవడం మీడియా ఫుటేజిలో స్పష్టంగా కనపడింది.
చనిపోయిన ఓ జవాను తల్లితండ్రులని పరామర్శించి ఓదార్చడానికి జగన్ వెళుతున్నప్పుడు ఆయన వెంట అంతమందిని ఎందుకు రానిచ్చారో తెలీదు. వచ్చినవారు మౌనంగా ఉండకుండా బిగ్గరగా మాట్లాడుకోవడంతో మురళీ నాయక్ తల్లి తండ్రులని వారి ఇంట్లో కాక ఏదో చేపల బజారులో కలిసినప్పుడు ఓదార్చుతున్నట్లనిపిస్తుంది… ఆ గోల చూస్తే!
Also Read – తెలంగాణ రాజకీయాలతో కూడా ఏపీకి తలనొప్పులేనా?
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినందున, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు జగన్‌కు పాయింట్ ఏదీ దొరకలేదు.
కానీ తన హయంలో ఈవిదంగా అమరులైన జవాన్లకు, పోలీసులకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చే విధానం ప్రవేశపెట్టానని జగన్ చెప్పుకొని, కూటమి ప్రభుత్వం కూడా దానిని కొనసాగిస్తునందుకు సంతోషమని అన్నారు.
Also Read – వైఎస్ స్పూర్తి.. వద్దు పైనున్న ఆయన బాధపడతారు!
ఎన్నికలలో వైసీపీ ఓడినా 40 శాతం ఓట్ షేర్ సాధించినందున నైతికంగా మనమే గెలిచామని చెప్పుకున్నారు. కానీ తమ ఓటమికి ఈవీఎంలు కారణమని చెప్పుకున్నారు. ఇప్పుడూ అలాగే ప్రవర్తించారు.
రూ.50 లక్షల కంటే తక్కువ ఇస్తే ఎలాగూ విమర్శిస్తారు. సమానంగా ఇచ్చినా, మరికాస్త ఎక్కువ ఇచ్చినా ఆ క్రెడిట్ నాదే అని గొప్పలు చెప్పుకుంటారు జగన్.
అంటే ఎక్స్‌గ్రేషియా చెల్లించింది కూటమి ప్రభుత్వం. కానీ ఆ క్రెడిట్ నాకే సొంతం అంటున్నారు జగన్.