jagan-political-troubles

కొన్ని సమస్యలు వాటంతట అవే పుట్టుకొస్తే, స్వయంకృతం వలన ఏర్పడేవి మరికొన్ని. ఈ రెండు విదాలుగా సమస్యలు జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టాయి. కానీ వాటన్నిటికీ స్వయంకృతమే కారణం కావడం విశేషం.

Also Read – వైసీపీ నేతల కేసులు.. ఎక్స్‌ఎల్ షీట్ పెట్టాలేమో?

కష్టం 1: ఇప్పటికే వైసీపీ నుంచి పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ చక్రవర్తి నలుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. ఇవాళ్ళ మరో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా రాజీనామా చేశారు. ఈయన వైసీపీ వీడబోతున్నారని చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈరోజు ఆయన కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. తన రాజీనామా లేఖను జగన్‌కు పంపారు.

కష్టం2: జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సాక్షి మీడియాకి చాలా ఉదారంగా సాయపడి లాభాల బాట పట్టించారు. ఇక పోలీస్ కస్టడీలో పోసాని కృష్ణ మురళి, సాక్షి మీడియా ఇచ్చిన సమాచారం ప్రకారమే ప్రెస్‌మీట్‌లో మాట్లాడనని చెప్పడం నిజమే అయితే, ఆయన స్టేట్‌మెంట్‌ ఆధారంగా పోలీసులు సాక్షి మీడియాకి నోటీసులు పంపించే అవకాశం ఉంటుంది.

Also Read – ఇక్కడ బిఆర్ఎస్.. అక్కడ టీడీపీ: కల్వకుంట్ల కవిత

కష్టం 3: ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో, వైసీపీలో కొంతమంది నేతలు జైళ్ళకు వెళ్ళివస్తున్నారు. కనుక ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘వాయిస్ ఆఫ్ వాయిస్‌ లెస్’గా ఉండాలనుకుంటున్న వైసీపీకి సాక్షి మీడియానే ‘వాయిస్’గా ఉండాలి. కానీ ఇప్పుడు అదే ఈ కేసులో చిక్కుకుంటే జగన్‌కి వాయిస్ గట్టిగా వినపడదు.

కష్టం 4: విజయసాయి రెడ్డి హటాత్తుగా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడమే జగన్‌కి ఇబ్బందికరంగా ఉందనుకుంటే, ఆయన మాట్లాడుతున్న మాటలు ఇంకా ఇబ్బందికరంగా మారాయి. ఆయన కాకినాడ పోర్టు కేసులో సీఐడీ విచారణకు వచ్చినప్పుడల్లా ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుతుంటే జగన్‌ ప్రతిష్ట మసకబారుతూనే ఉంటుంది. ఆ ప్రభావం వైసీపీపై పడుతూనే ఉంటుంది. అప్పుడు ఇలాగే ఒక్కో నేత లేదా ఎమ్మెల్సీ బయటకు జారుకుంటుంటారు.

Also Read – అమెరికా- చైనా టిట్ ఫర్ టాట్ గేమ్స్ ఓకే కానీ..

కనుక ఒక్క ఛాన్స్ విలువ జగన్‌ గ్రహించి సద్వినియోగం చేసుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఇన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని చెప్పక తప్పదు. అంటే ఇవన్నీ స్వయంకృతమేనన్న మాట!