దేశంలో ఏడాది పొడవునా ఎక్కడో అక్కడ ఏవో ఓ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి శాసనసభ ఎన్నికలు జరుగుతుంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలు సరేసరి! మోడీ ప్రభుత్వం బలంగా, స్థిరంగా ఉంది కనుక లోక్ సభ ఎన్నికలు మాత్రం 5 ఏళ్ళకోసారి ఏప్రిల్-మే నెలల్లో జరుగుతున్నాయి.
కానీ ఈవిదంగా ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతుంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాలన, అభివృద్ధిపై దృష్టి పెట్టలేకపోతున్నాయని. ఈ కారణంగా అభివృద్ధి నత్తనడకన సాగుతోందని ప్రధాని మోడీ అభిప్రాయపడుతున్నారు.
Also Read – ఈ విందుని జగన్ జీర్ణించుకోలేరేమో?
ఈ సమస్యకి ఏకైక పరిష్కారం పంచాయితీల నుంచి శాసనసభ, లోక్ సభ వరకు అన్నిటికీ ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించడమే అని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ చేత అధ్యయనం చేయించి సాధ్యమే అని ధృవీకరించుకున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జమిలి ప్రతిపాదనకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇప్పుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున జమిలి ముసాయిదా బిల్లుకి మరోసారి ఆమోదం తెలిపింది. ఈ నెల 13,14 తేదీలలో ఈ జమిలి ముసాయిదా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది.
Also Read – అందరికీ పంచింగ్ బ్యాగ్ మన టాలీవుడ్?
ఈ బిల్లుని లోక్ సభలో ఆమోదింపజేసుకోవడానికి మోడీ ప్రభుత్వానికి అవసరమైన బలముంది. రాజ్యసభలో ఆమోదింపజేసుకోవడానికి అవసరమైన లౌక్యం ఉంది. కనుక పార్లమెంటులో ప్రతిపక్షాలు ఈ బిల్లుని ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా ఆమోదింపజేసుకోవడం ఖాయమే అని భావించవచ్చు.
అయితే దీని కోసం చేయాల్సిన మార్పులు, చేర్పులు, ఏర్పాట్లు అంత తేలిక కాదు. ముందుగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు శాసనసభలలో తీర్మానాలు చేసి ఈ ప్రతిపాదనని ఆమోదించాల్సి ఉంటుంది.
Also Read – అప్పుడే కేసీఆర్ కొనేసి ఉంటే..
మరో పెద్ద సమస్య ఏమిటంటే, తెలంగాణలో డిసెంబర్ 2023, ఏపీలో ఏప్రిల్-మే 2024, ఝార్ఖండ్, మహారాష్ట్రలో డిసెంబర్ 2024లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరుగబోతున్నాయి.
ఇదేవిదంగా దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో వందలాది మునిసిపల్ కార్పొరేషన్, వేలాది మున్సిపాలిటీలు, పంచాయితీల ఎన్నికలు వేర్వేరు సమయాలలో జరుగుతుంటాయి. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కొత్తగా ఎన్నికైన ఈ ప్రభుత్వాలతో పాటు ఈ స్థానిక సంస్థలన్నీటినీ కూడా రద్దు చేయాల్సి ఉంటుంది. అందుకు ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?అంటే ఎట్టి పరిస్థితులలో అంగీకరించబోమని కాంగ్రెస్ మిత్ర పక్షాలు తెగేసి చెపుతున్నాయి.
అత్యంత ధనిక పార్టీలైన కాంగ్రెస్, బీజేపిలు జమిలి ఎన్నికల ఆర్ధిక భారాన్ని భరించగలవు. కానీ ప్రాంతీయ పార్టీలు ఏమాత్రం తట్టుకోలేవు.
అందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి లోక్ సభ, శాసనసభ ఎన్నికలను విడదీసుకున్నారు. అలాంటప్పుడు పంచాయితీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, శాసనసభ, లోక్ సభ ఎన్నికలన్నిటినీ ఒకేసారి నిర్వహిస్తే ప్రాంతీయ పార్టీలు తట్టుకోగలవా? అందుకే అవి ఈ జమిలి ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కనుక పార్లమెంటులో బిల్లు పాస్ చేసినా ఆచరణలో జమిలి చాలా కష్టమే.
అయితే జగన్ మాత్రం 2027లోనే జమిలి ఎన్నికలు వచ్చేయాలని, వాటిలో గెలిచి తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవాలని పగటి కలలు కంటున్నారు. ఎందుకంటే ఆయనకు పోయేదీ ఏమీ లేదు కనుక.