JrNTR_Ram_Charan

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో వరద మిగిల్చిన కల్లోలానికి తమ వంతు సాయంగా టాలీవుడ్ ప్రముఖులు ముందుకు వచ్చారు. ఎవరికీ తోచినంత వారు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ప్రకటించారు. అయితే ఆ విరాళాలు ప్రకటన రూపంలో కాకుండా చెక్కుల రూపంలో సీఎం బాబుకి అందించడానికి సినీ సెలబ్రేటిస్ ఒక్కొక్కరు అమరావతికి క్యూ కడుతున్నారు.

Also Read – ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి బీజేపీ గెలిచిందేమో… జగన్‌ డౌట్!

ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఒక కోటి రూపాయిలు, బాలకృష్ణ 50 లక్షలు, అక్కినేని కుటుంబం నుండి వెంకట్ 50లక్షలు, మెగా హీరో సాయి దుర్గ తేజ్10 లక్షలు, సిద్దు జొన్నల గడ్ద 15 లక్షలు, విశ్వక్ సేన్ 10 లక్షలు నేరుగా ఏపీకి వచ్చి చంద్రబాబు చేతికి అందించారు.

అయితే నేడు జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా తమవంతు సాయం కింద ఏపీకి ప్రకటించిన చెరో 50 లక్షల చెక్ లను సీఎం చంద్రబాబుకు అందించే నేపథ్యంలో అమరావతికి రానున్నారు. అయితే గత కొద్దీ కొన్నేళ్లుగా అటు నారా,ఇటు నందమూరి కుటుంబాలకు జూ.ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు అనే ఊహాగానాల మధ్య బాబుతో జూనియర్ భేటీ అటు టీడీపీలోని ఇటు తారక్ అభిమానులలోనూ ఆసక్తి రేపుతోంది.

Also Read – కిల్ బిల్ పాండ్య’..!

అయితే వీరిద్దరి మధ్య ఎటువంటి రాజకీయ చర్చలకు ఆస్కారం ఉండకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి ని కలిసి సాయం అందించి వెళ్లిపోవచ్చు అంటూ విశ్లేషణలు మొదలుపెట్టారు. అయితే ఏది ఏమైనా బాబు తారక్ భేటీ ఇటు వర్గాలలో పెద్ద చర్చకే తెరలేపింది. అలాగే బాబు తారక్ భేటీ తో ఈ కుటుంబాల మధ్య ఏర్పడినా గ్యాప్ కాస్త తగ్గే అవకాశం ఉందంటున్నారు జూనియర్ ఫాన్స్.




అలాగే అటు తారక్, రామ్ చరణ్ కూడా ఇద్దరు కలిసి రావడంతో RRR తో వీరిద్దరి మధ్య బలపడిన స్నేహం ఇంకా చెక్కుచెదరలేదని ఇద్దరి హీరోల అభిమానులు ఆనందిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఒకేలానే ఉంటారు కానీ అభిమానులు మాత్రం మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో ఎందుకు పనికి రాని ఫ్యాన్ వార్ ను సృష్టించుకుని వాగ్వాదానికి దిగితుంటారు.

Also Read – ఒక్క ‘దేవర’ కే పట్టిన చిక్కా..?