kakani-govardhan-reddy--

గనులలో కార్మికులు ఎంతగానో శ్రమిస్తే తప్ప ఖనిజాలు బయటపడవు. క్వార్జ్ కూడా అటువంటి విలువైన ఖనిజమే. నెల్లూరు జిల్లాలో ఇది లభిస్తుంది కనుక వైసీపీ హయంలో మంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి క్వార్జ్ గనులపై సహజంగానే హక్కు ఏర్పడింది.

Also Read – సొంత చెల్లినే పీడించిన జగన్‌ ప్రత్యర్ధులను ఉపేక్షిస్తారా?

పద్దతి ప్రకారం అనుమతి తీసుకొని ఆ తర్వాత సుమారు రూ.250 కోట్లు విలువైన క్వార్జ్ తవ్వుకొని విదేశాలకు అమ్ముకున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్పుడే కేంద్రానికి పిర్యాదు చేశారు. కానీ కేంద్రం పట్టించుకోలేదు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మైనింగ్ అధికారుల పిర్యాదు మేరకు పోలీసులు ‘క్వార్జ్ ఫైల్స్ తవ్వకాలు’ మొదలుపెట్టి కాకాణి గోవర్ధన్ రెడ్డి (ఏ4)తో సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. ఆ కేసులో విచారణకు రావాలని పోలీసులు ఎన్నిసార్లు నోటీసులు పంపించినా అరెస్ట్‌ భయంతో కాకాణి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు కూడా నేడు ఆయనకు బెయిల్‌ తిరస్కరించింది.

Also Read – జగన్‌ వార్ డిక్లేర్… ఇవిగో సాక్ష్యాలు!

కనుక కాకాణి ముందు రెండే దారులున్నాయిప్పుడు. 1. అజ్ఞాతంలో నుంచి బయటకు వచ్చి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావడం. 2. విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలో నుంచి విదేశాలకు పారిపోవడం. కానీ రెండూ కష్టమే!

ఒకవేళ విచారణకు హాజరైతే పోలీసులు అరెస్ట్‌ చేసి లోపల వేస్తారు. వేస్తే జగన్‌ ఓసారి వచ్చి పరామర్శించి అక్కడితో తన పని అయిపోయినట్లు వెళ్ళిపోతారు. ఒకసారి లోపల వేస్తే వల్లభనేని వంశీలా నెలల తరబడి లోపల ఉండిపోవాల్సి వస్తే భరించడం చాలా కష్టం.

Also Read – అందుకు జగన్‌ని అభినందించాల్సిందే.. వారిపై జాలిపడాల్సిందే!

అలాగని ఇన్ని వందల కోట్ల వ్యాపారాలు సాగుతుంటే ఎక్కువ కాలం అజ్ఞాతంలో ఉంటూ వాటన్నిటినీ మెయిన్‌టెయిన్ చేయడం చాలా కష్టం. ఒకవేళ విదేశాలకు పారిపోయినా అక్కడే ఉండిపోలేరు. కనుక మరి కాకణి ఏం చేస్తారో చూడాలి.

కాకాణి కూడా ‘క్వార్జ్’లా కనపడకుండా మెరుస్తున్నారు. కనుక కాకాణీ, క్వార్జ్ రెండూ చాలా విలువైనవే. కనుక వాటి కోసం వెతుకులాట తప్పదు.