vijaysai-reddy-sarath-chandra-ed-scam

జగన్‌ హయంలో వైసీపీ నేతలు ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు, చెరువులు మాత్రమే కాదు కాకినాడ పోర్టు కూడా కబ్జా చేసి దేశంలోనే సరికొత్త ‘కబ్జా రికార్డ్’ సృష్టించారు. గిన్నిస్ బుక్‌లో నమోదు చేయాల్సిన ఈ సరికొత్త రికార్డుని ఈడీ రికార్డు చేయడం చాలా బాధాకరమే.

Also Read – తెలుగు సినిమాలకు తెలంగాణ తలుపులు మూసుకుపోయిన్నట్లేనా?

వైసీపీ నేతలు పోర్టు యజమాని కేవీ రావుని బెదిరించి భయపెట్టి బలవంతంగా కాకినాడ పోర్టుని, పక్కనే ఉన్న సెజ్‌ని బలవంతంగా అరబిందో గ్రూప్ పేరిట బదిలీ చేయించుకున్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన ధైర్యం చేసి పోలీసులకు పిర్యాదు చేయడం, వెంటనే వారు కేసు నమోదు చేశారు. వెంటనే ఈడీ కూడా రంగంలో దిగి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, అరబిందో అధినేత శరత్ చంద్రా రెడ్డితో సహా పలువురు వైసీపీ నేతలకి నోటీసులు పంపించి ప్రశ్నించింది.

Also Read – విశాఖ రైల్వే జోన్‌కి ఇన్ని తిప్పలా?

కేవీరావు పిర్యాదు మేరకు ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు, “రెండు ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తుల మద్య చట్టబద్దంగా జరిగిన వ్యాపార, ఆర్ధిక లావాదేవీలని అవినీతిగా చూపిస్తూ చంద్రబాబు నాయుడు తమపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని” విజయసాయి రెడ్డి ఆరోపించారు.

“ఈ వ్యాపారలావాదేవీల కొరకు అరబిందో సంస్థ కేవీ రావుకి కాకినాడ పోర్టు వాటాల నిమిత్తం రూ.494 కోట్లు, కాకినాడ సెజ్ కొరకు మరో రూ.12 కోట్లు చెల్లించింది కదా?

Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?

ఒకవేళ బెదిరించి భయపెట్టి వాటాలు రాయించుకోదలిస్తే అంత డబ్బు ఎందుకు చెల్లిస్తాము? ఈ వాటాల బదిలీ సెబీ, రిజర్వ్ బ్యాంక్ తదితర సంస్థల నియమ నిబంధనల ప్రకారమే పూర్తి పారదర్శకంగా జరిగాయి కదా?మాపై కక్ష సాధించాలనే తాపత్రయమే తప్ప ఇవన్నీ సిఎం చంద్రబాబు నాయుడు ఇవన్నీ పట్టించుకోలేదు,” అంటూ విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో వారుసపెట్టి ట్వీట్స్ వేశారు కూడా.

కానీ ఈడీ రంగంలో దిగి విజయసాయి రెడ్డితో సహా అందరికీ నోటీసులు పంపించి ప్రశ్నించడం మొదలుపెట్టడంతో వైసీపీ నేతలు హడావుడిగా కేవీ రావు ముందు వాలిపోయి కాకినాడ పోర్టుని తిరిగి అప్పగించేసేందుకు సిద్దమయ్యారు.

ఈ మేరకు మళ్ళీ కేవీరావుతో ఒప్పందం కూడా చేసుకున్నారు. వాటాల బదిలీ కోసం వారు చెల్లించిన సొమ్ముని వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేసేందుకు కేవీ రావు అంగీకరించారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవగానే కాకినాడ పోర్టు మళ్ళీ కేవీ రావు చేతికి వస్తుంది. కాకినాడ సెజ్ కూడా తిరిగి అప్పగించాల్సి ఉంది. వీలైనంత త్వరగా డానినీ అప్పగించాలని కేవీరావు వైసీపీ నేతలకు గట్టిగా చెప్పిన్నట్లు తెలుస్తోంది.

తాము ఎవరినీ బెదిరించలేదని, బలవంతంగా వాటాలు గుంజుకోలేదని వాదించిన విజయసాయి రెడ్డి ఇప్పుడు కాకినాడ పోర్టుని ఎందుకు తిరిగి ఇచ్చేస్తున్నారో చెప్పగలరా?పోర్టు తిరిగి ఇచ్చేస్తున్నారంటే నేరం చేసిన్నట్లు అంగీకరించిన్నట్లేగా?




కనుక పోర్టు తిరిగి ఇచ్చేసినా నేరం చేసిననట్లు వారే స్వయంగా ధృవీకరించుకున్నారు కనుక ఈడీ కేసు కొనసాగించకుండా ఉంటుందా? అంటే వైసీపీ నేతలకు కాకినాడ పోర్టు చేజారిపోగా ఈడీ కేసు మాత్రం మిగిలిందన్న మాట!